నూతన విద్యార్థులకు ఓరియంటేషన్
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్.జి.ఎస్. ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సర విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళవారం కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపల్ డా.ఎం.మాదన్న హాజరై కళాశాల చరిత్ర, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కోర్సుల వివరాలు, పరీక్షల విధివిధానాలు, ఉద్యోగ కల్పనకు కల్పిస్తున్న సౌకర్యాలు, చదువులో తీసుకోవాల్సిన మెలకువలు, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్. ద్వారా కలిగే ప్రయోజనాల గురించి చక్కని అవగాహన కల్పించారు. కామర్స్ విభాగాధిపతి, సీఓఈ డా. బి. ఉమామహేశ్వరి పరీక్షల విభాగం ఆవశ్యకత గురించి వివరిస్తూ పట్టుదలతో ఉంటే లక్ష్యాన్ని సునాయాసంగా సాధించవచ్చన్నారు. డా.పి. సృజన స్కిల్ కోర్సులు, ఇంటర్న్ షిప్ ల గురించి, డా.ఎన్.జగదీష్ కుమార్ మైనర్ సబ్జెక్టుల గురించి వివరించారు. పి.చంద్రయ్య ప్లేస్ మెంట్ల గురించి, టి.శకుంతల విద్యార్థినుల రక్షణ, వారు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అన్ని విభాగాల అధ్యాపకులు తమ విభాగాల ప్రత్యేకతలను వివరించారు. డా.కె.కోటేశ్వరయ్య అలుమ్ని గురించి, డా.డి.సుధాకర్ ఎన్.ఎస్.ఎస్. గురించి, డిప్యూటీ వార్డెన్లు డా.కె.రాజేష్, పి.హరీష్ రెడ్డి హాస్టల్ సౌకర్యాలు, పాటించాల్సిన నిబంధనల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్