BREAKING
కలాం బాటలో నడవండి -కలలను సాకారం చేసుకుని గర్వకారణంగా ఎదగండి -బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఏవీఎస్ సూర్యనారాయణ రాజు అర్హులందరికీ సంక్షేమ పథకాలు.. సిద్దిపేట తరహాలో వికారాబాద్ అభివృద్ధి చేస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రూ. 2 కోట్ల జీతం తగ్గించుకుని జట్టు మారిన టీమిండియా స్టార్ పేసర్, ఐపీఎల్ 2027లో మాజీ ఛాంపియన్ జట్టులోకి మొహమ్మద్ షమీ రైతులకు అండగా ప్రభుత్వం.. - ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం భూభారతి పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి ప్రజల భాగస్వామ్యంతో భూ రీ సర్వే పూర్తి చేయాలి ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం: జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు దివ్యాంగుడికి ఉచితంగా మూడు చక్రాల వాహనం అందజేసిన చైర్‌పర్సన్ గడ్డం అనన్య ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం: జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు యాసంగిలో వరి సాగు వద్దు! - ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి - జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గ్యాస్ పైప్‌లైన్ పనులు వేగవంతం చేయాలి మార్చి 2028 నాటికి పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు యువతలో ప్రతిభను వెలికితీయడమే యువజనోత్సవాల లక్ష్యం. అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు రెవిన్యూ విభాగంలోని పెండింగ్ఆర్జీలను వారంలోపు పరిష్కరించాలి: నగర కమిషనర్ ప్రేమతో జూనియర్ల హృదయాలను గెలుచుకోవాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తరలింపు

ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం: జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు

Select Suryaa Now
ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం:  జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు

సత్తెనపల్లి, మేజర్ న్యూస్ : ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటిస్తూ, రైతులకు అవసరమైన ఎరువులను సులభంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఎం. జగ్గారావు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌) పేరుతో నూతన యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. గతంలో వినియోగంలో ఉన్న ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ స్థానంలో దీనిని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. మంగళవారం 

ఈ యాప్‌ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు మండలంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు మాట్లాడుతూ.. రైతులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆధార్ లేదా రైతు గుర్తింపు సంఖ్య, ఓటీపీ ద్వారా ధ్రువీకరణ చేసుకోవాలని సూచించారు. అనంతరం యాప్‌లో భూమి వివరాలు కనిపిస్తాయని తెలిపారు. కౌలు, వారసత్వ, అటవీ పట్టాలు, దేవాదాయ, ప్రభుత్వ భూములకు కూడా ప్రత్యేక వెసులుబాటు కల్పించినట్లు వివరించారు.

రైతులు తమ భూమి విస్తీర్ణం, సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసిన అనంతరం వారికి సిఫారసు చేసిన ఎరువుల వివరాలు యాప్‌లో కనిపిస్తాయని చెప్పారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌, ఎంఓపీ ఎరువుల వివరాలు ఇందులో ఉంటాయని, యూరియా, డీఏపీ పరిమాణాల్లో ఎలాంటి మార్పు ఉండదని, ఇతర ఎరువుల ఎంపికలో రైతులకు వెసులుబాటు ఉంటుందని తెలిపారు.

రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రైతులు ఎరువులను ముందస్తుగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. నమోదు పూర్తయిన తర్వాత రైతులకు ప్రత్యేక సంకేత చిత్రం (క్యూఆర్‌ కోడ్‌) వస్తుందని, దాని ఆధారంగా 48 గంటల్లోపు ఎరువులు కొనుగోలు చేయాలని సూచించారు. గడువులోగా కొనుగోలు చేయకపోతే నమోదు రద్దవుతుందని స్పష్టం చేశారు. భూముల వివరాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని కోరారు. రైతులకు సహాయపడేందుకు ప్రతి ఎరువుల దుకాణంలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.రైతుల స్థాయిలో నూతన యాప్‌ పనితీరును పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ కార్యాలయం నుంచి వచ్చిన ఉప సంచాలకులు ఆనంద్‌కుమార్‌, యాప్‌ రూపకల్పన సంస్థ ప్రతినిధి రైతులకు యాప్‌ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప వ్యవసాయ సంచాలకులు రవిబాబు, మండల వ్యవసాయ అధికారి బి. సుబ్బారెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.

గన్నవరం ఏలియ