BREAKING
భూభారతి పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి ప్రజల భాగస్వామ్యంతో భూ రీ సర్వే పూర్తి చేయాలి ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం: జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు దివ్యాంగుడికి ఉచితంగా మూడు చక్రాల వాహనం అందజేసిన చైర్‌పర్సన్ గడ్డం అనన్య ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం: జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు యాసంగిలో వరి సాగు వద్దు! - ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి - జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గ్యాస్ పైప్‌లైన్ పనులు వేగవంతం చేయాలి మార్చి 2028 నాటికి పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు యువతలో ప్రతిభను వెలికితీయడమే యువజనోత్సవాల లక్ష్యం. అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు రెవిన్యూ విభాగంలోని పెండింగ్ఆర్జీలను వారంలోపు పరిష్కరించాలి: నగర కమిషనర్ ప్రేమతో జూనియర్ల హృదయాలను గెలుచుకోవాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తరలింపు శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి తేప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. డబుల్ రిజిస్ట్రేషన్ తో వినుకొండలో మరదలి ఆస్తినే కాజేసి చేసిన బావ కుటుంబ కందుకూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సి నాగమణి నామినేషన్ లలితకళా ఉత్సవం కోసం బాల కుటీర్ నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఆహ్వానం

యువతలో ప్రతిభను వెలికితీయడమే యువజనోత్సవాల లక్ష్యం. అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు

Select Suryaa Now
యువతలో ప్రతిభను వెలికితీయడమే యువజనోత్సవాల లక్ష్యం.   అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు

 

సూర్య - పెద్దపల్లి : యువతలోని సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను వెలికితీయడమే జాతీయ యువజనోత్సవాల ముఖ్య ఉద్దేశమని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అన్నారు. మంగళవారం పెద్దపల్లిలోని సిరి ఫంక్షన్ హాల్‌లో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 210 మందికి పైగా విద్యార్థులు పాల్గొని జానపద నృత్యం, గీతాలు, చిత్రలేఖనం, వీధి నాటకాలు, కవితా రచన తదితర పోటీల్లో ప్రతిభ కనబరిచారని తెలిపారు. విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం విజేతలకు మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో యువజన, క్రీడల శాఖ అధికారి సురేష్, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.