BREAKING
అడవి ఆముదం గింజలు తిని 10 మంది విద్యార్థులు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం MLC మీర్జా రహమత్ బేగ్ బ్లాక్‌మెయిల్ కేసులో కీలక పరిణామం.. సల్మాన్ ఖాన్ అరెస్ట్, రిమాండ్ పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల పూతలపట్టులో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అట్టహాసంగా 'అష్టదిగ్గజాలు' కవి సమ్మేళనం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ భాష్యం రామకృష్ణ ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలి: పవన్ కళ్యాణ్ అమరుల స్ఫూర్తితో.. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ప్రముఖ మలయాళ గాయని రిమి టోమి రెండో వివాహం, జిమ్ ట్రైనర్ లిబిన్ మాత్యుతో వైభవంగా పెళ్లి ఇంకొల్లు మండలంలో చివరి రోజు సర్పంచ్‌, వార్డు సభ్యులకు 228 నామినేషన్లు దాఖలు ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోలాహలంగా రాచానుపల్లి వైసీపీ మద్దతు దారుడు, సర్పంచ్ అభ్యర్థి బండ అంజి యాదవ్ నామినేషన్ ఇంట్లోనే మద్యం దుకాణమా.. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమా? అంధకారంలో పూతలపట్టు మండలంలోని వైఎస్ఆర్ కాలనీలు వీధి దీపాలు లేక ప్రజల నరకయాతన చీకట్లో విషపురుగుల భయం.. పట్టించుకోని అధికారులు పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కవ్వంపల్లి విద్యార్థినికి ఎమ్మెల్యే సన్మానం

కోలాహలంగా రాచానుపల్లి వైసీపీ మద్దతు దారుడు, సర్పంచ్ అభ్యర్థి బండ అంజి యాదవ్ నామినేషన్

Select Suryaa Now
కోలాహలంగా రాచానుపల్లి వైసీపీ మద్దతు దారుడు, సర్పంచ్ అభ్యర్థి బండ అంజి యాదవ్ నామినేషన్

కోలాహలంగా రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థి, వైసీపీ మద్దతుదారుడు బండ అంజి యాదవ్ నామినేషన్ 
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : వైసీపీ నాయకులు, కార్యకర్తల కోలాహలం నడుమ రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థి, వైసిపి మద్దతుదారుడు  బండ అంజి యాదవ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. తొలుత ఉదయం 10 గంటలకు రాచానుపల్లి, సిండికేట్ నగర్ లోని ఆలయాల్లో  పూజలు నిర్వహించి... అనంతరం గ్రామాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి.. అనంతపురం రూరల్ పంచాయతీ కార్యాలయం వరకు ప్రదర్శనగా వచ్చారు. అనంతరం ఎన్నికల అధికారులకు.. సర్పంచ్ అభ్యర్థి, పంచాయతీలో వార్డు సభ్యులకు.. తన మద్దతు దారులతో కలిసి నామినేషన్లను అందజేశారు. నామినేషన్ అనంతరం బండి అంజి యాదవ్ మాట్లాడుతూ  సర్పంచ్ అభ్యర్థిగా రెండవసారి  తనకు అవకాశం కల్పించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్లలో రాచానుపల్లి సర్పంచ్ గా  గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేశానని తెలిపారు. పంచాయతీలో పలు కాలనీలకు సిసి రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కారం కోసం.... అనేక బోర్లు వేయించడం జరిగిందనీ తెలిపారు. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ అందించినట్లు తెలిపారు.  ఆపదలో ఉన్న,  అనారోగ్యంతో మృతి చెందిన.. పేదల కుటుంబాలకు  ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. పంచాయతీలో.. ప్రజలకు... పేదలకు ఏ కష్టం వచ్చినా.. తన వంతుకు అండగా నిలిచానని తెలిపారు. సర్పంచ్ గా తనకు  రాచానుపల్లి పంచాయతీ ప్రజలు.. రెండవసారి అవకాశం కల్పించి గెలిపిస్తే... పంచాయతీలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అంజి యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.