BREAKING
అడవి ఆముదం గింజలు తిని 10 మంది విద్యార్థులు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం MLC మీర్జా రహమత్ బేగ్ బ్లాక్‌మెయిల్ కేసులో కీలక పరిణామం.. సల్మాన్ ఖాన్ అరెస్ట్, రిమాండ్ పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల పూతలపట్టులో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అట్టహాసంగా 'అష్టదిగ్గజాలు' కవి సమ్మేళనం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ భాష్యం రామకృష్ణ ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలి: పవన్ కళ్యాణ్ అమరుల స్ఫూర్తితో.. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ప్రముఖ మలయాళ గాయని రిమి టోమి రెండో వివాహం, జిమ్ ట్రైనర్ లిబిన్ మాత్యుతో వైభవంగా పెళ్లి ఇంకొల్లు మండలంలో చివరి రోజు సర్పంచ్‌, వార్డు సభ్యులకు 228 నామినేషన్లు దాఖలు ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోలాహలంగా రాచానుపల్లి వైసీపీ మద్దతు దారుడు, సర్పంచ్ అభ్యర్థి బండ అంజి యాదవ్ నామినేషన్ ఇంట్లోనే మద్యం దుకాణమా.. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమా? అంధకారంలో పూతలపట్టు మండలంలోని వైఎస్ఆర్ కాలనీలు వీధి దీపాలు లేక ప్రజల నరకయాతన చీకట్లో విషపురుగుల భయం.. పట్టించుకోని అధికారులు పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కవ్వంపల్లి విద్యార్థినికి ఎమ్మెల్యే సన్మానం

మిట్స్ వర్శిటీ వైస్ చాన్సలర్ యువరాజ్ సేవాతత్పరత : కుమార్తె పుట్టినరోజు వేళ చైతన్య సంస్థలో అన్నదానం : కృతజ్ఞతలు తెలిపిన జనరల్ సెక్రటరీ కవితా రాణి

Select Suryaa Now
మిట్స్ వర్శిటీ వైస్ చాన్సలర్ యువరాజ్ సేవాతత్పరత : కుమార్తె పుట్టినరోజు వేళ చైతన్య సంస్థలో అన్నదానం : కృతజ్ఞతలు తెలిపిన జనరల్ సెక్రటరీ కవితా రాణి

మదనపల్లె,మేజర్ న్యూస్ : జన్మదిన వేడుకలను కేవలం కుటుంబ సభ్యులు,స్నేహితుల మధ్య జరుపుకోవడమే కాకుండా నిరుపేద చిన్నారులు,వృద్ధుల మధ్య సేవా కార్యక్రమాలతో నిర్వ హించడం అభినందనీయమని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతి నిధులు పేర్కొన్నారు.మదనపల్లెకి విశేష గుర్తింపు తీసుకొచ్చిన మిట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యువరాజ్ తన కుమార్తె ప్రిషా జన్మదినాన్ని పురస్కరించుకొని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో చిన్నారులకు,ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వ హించారు.చిన్నారులు,వృద్ధులతో కలిసి జన్మదిన వేడుకలను ఆత్మీయంగా జరుపుకోవడంతో అక్కడ ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.గత ఆరు సంవత్సరాలుగా యువరాజ్ తన కుమార్తె ప్రిషా జన్మదిన వేడుకలు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో నిర్వహిస్తు అండగా నిలుస్తున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు.కేవలం ఆర్థిక సహాయం అందించడమే కాకుండా మిట్స్ యూనివర్సిటీ విద్యార్థులకు సంస్థ నిర్వహిస్తున్న సేవాకార్యక్రమాల గురించి వివరిస్తూ వారిలో సామాజిక బాధ్యత,సేవా దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.యువరాజ్ ప్రోత్సాహంతో మిట్స్ విద్యార్థులు తమ విలువైన సమయాన్ని,జ్ఞానాన్ని,పాకెట్ మనీని సైతం సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తూ వివిధ వితరణ కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం సంతోషకరమని తెలిపారు.ఈ సందర్భంగా ప్రిషాకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె ఆయురారోగ్యాలతో,సంతోషంగా జీవిస్తూ ఉజ్వల భవిష్యత్తును అందుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జి.వి.ఎస్ బాబు,జనరల్ సెక్రటరీ ఎ.కవితా రాణి పాల్గొని వీసికి కృతజ్ఞతలు తెలియజేశారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి