రాందాస్ కాలనీలో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం
నకరికల్లు మేజర్ న్యూస్: నకరికల్లు గ్రామంలోని రాందాస కాలనీ ప్రాథమిక పాఠశాలలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (డీబీఆర్‌సీ) ఆధ్వర్యంలో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డీబీఆర్‌సీ ప్రతినిధి కోటిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఎస్. విజయలక్ష్మి, మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్ నాగభూషణం, గ్రామ కమ్యూనిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలల హక్కులు, వాటి ప్రాధాన్యత గురించి విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు. బాలల హక్కుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.