BREAKING
ఏకగ్రీవ సర్పంచును అభినందించిన ఎమ్మెల్యే కాకర్ల కావలి చైర్‌పర్సన్ పీఠానికి 18 మంది పోటీ.. 21 నామినేషన్లు దాఖలు రజక సోదరుడిపై దాడి ఘటనపై సంఘం ఆగ్రహం.. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబుతో కమిషనర్ ప్రమీల భేటీ : నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై కీలక చర్చ దిశ మార్చుకున్న అక్వాన్‌ తుఫాన్‌.. ప్రతిష్టాత్మక స్వచ్ఛ అవార్డు ప్రోత్సాహకం అందుకున్న కార్పొరేషన్ సోమశిలలో సాయంత్రం వేళ ఆవుల బెడద.. పట్టించుకోని అధికారులు! రాందాస్ కాలనీలో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నమ్ముకున్న పార్టీలు న్యాయం చేయలేదు ఎంపీపీ ఎన్నికల విప్ నియామక పత్రాన్ని ఎంపీడీవోకు అందజేసిన మన్నారపు రవికుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన సీఈవో --నిర్మాణ పనులు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సంజీవ్ హోరా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యల ఘనంగా వైస్ చైర్మన్ నవీన్ అన్నకి బర్త్‌డే వేడుకలు జిల్లా స్థాయి క్విజ్‌లో నకరికల్లు విద్యార్థిని ప్రతిభ ప్రథమ స్థానం సాధించిన కె. రిషిత శ్రీకరి నామినేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

షాహీనా కుటుంబానికి అండగా హరీష్ రావు

Select Suryaa Now
షాహీనా కుటుంబానికి అండగా హరీష్ రావు

సిద్దిపేట రూరల్, మేజర్ న్యూస్:కష్టకాలంలో బాధిత కుటుంబాలను ఆదుకోవడం మానవతా ధర్మమని సిద్దిపేట రూరల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, పెద్దలింగారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బట్టు భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పెద్దలింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన షాహీనా మృతి చెందడంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సహకారంతో ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా బట్టు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. షాహీనా కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహకారం అందించిన ఎమ్మెల్యే హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబానికి గ్రామ ప్రజల తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, కుల పెద్దలు, గ్రామ ప్రజలు  తదితరులు పాల్గొన్నారు.

(సిద్దిపేట రూరల్, రమేష్)