BREAKING
ఏకగ్రీవ సర్పంచును అభినందించిన ఎమ్మెల్యే కాకర్ల కావలి చైర్‌పర్సన్ పీఠానికి 18 మంది పోటీ.. 21 నామినేషన్లు దాఖలు రజక సోదరుడిపై దాడి ఘటనపై సంఘం ఆగ్రహం.. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబుతో కమిషనర్ ప్రమీల భేటీ : నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై కీలక చర్చ దిశ మార్చుకున్న అక్వాన్‌ తుఫాన్‌.. ప్రతిష్టాత్మక స్వచ్ఛ అవార్డు ప్రోత్సాహకం అందుకున్న కార్పొరేషన్ సోమశిలలో సాయంత్రం వేళ ఆవుల బెడద.. పట్టించుకోని అధికారులు! రాందాస్ కాలనీలో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నమ్ముకున్న పార్టీలు న్యాయం చేయలేదు ఎంపీపీ ఎన్నికల విప్ నియామక పత్రాన్ని ఎంపీడీవోకు అందజేసిన మన్నారపు రవికుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన సీఈవో --నిర్మాణ పనులు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సంజీవ్ హోరా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యల ఘనంగా వైస్ చైర్మన్ నవీన్ అన్నకి బర్త్‌డే వేడుకలు జిల్లా స్థాయి క్విజ్‌లో నకరికల్లు విద్యార్థిని ప్రతిభ ప్రథమ స్థానం సాధించిన కె. రిషిత శ్రీకరి నామినేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యల

Select Suryaa Now
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యల

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఎన్నికల్లో పోటీ చేయడం ప్రతి ఒక్కరి ప్రజాస్వామ్య హక్కు అని, గెలుపోటములు సహజమని, అయితే ఎన్నికల పేరుతో గ్రామాల్లో గొడవలు, వర్గ విభేదాలు, బెదిరింపులు, దాడులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండకూడదని కోరుకొండ సి ఐ మూర్తి సూచించారు. గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలీసు పలు సూచనలు చేసారు. పోలీస్ శాఖ ఎవరిపట్ల పక్షపాతం లేకుండా, చట్టప్రకారం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని, ఎన్నికల ప్రవర్తన నియమావళి నిష్పక్షపాతంగా అమలు చేస్తుందన్నారు. ఈ విషయంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, గ్రామ పెద్దలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. నామినేషన్ల కేంద్రాల వద్ద అభ్యర్థులు, వారి ప్రతినిధులు ఎన్నికల అధికారుల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నామినేషన్ దాఖలు చేయడానికి ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారులు అనుమతించిన వ్యక్తులు మొత్తం ముగ్గురిని మాత్రమే కేంద్రంలోకి వెళ్లాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద గుంపులుగా చేరడం, అనవసరంగా గుమిగూడడం, ర్యాలీలు నిర్వహించడం చేయకూడదన్నారు. అలాగే ఇతర అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకోవడం, అడ్డంకులు సృష్టించడం, బెదిరించడం, దౌర్జన్యానికి పాల్పడం చేయకూడదన్నారు. నామినేషన్ కేంద్రాలకు నిర్ణీత దూరంలో మాత్రమే వాహనాలు పార్కింగ్ చేయాలని పోలీస్ సిబ్బంది సూచించిన పార్కింగ్ ప్రాంతాలను ఉపయోగించాలన్నారు. ఏదైనా అభ్యంతరం లేదా సమస్య ఉంటే ఎన్నికల రిటర్నింగ్ అధికారిని లేదా పోలీస్ అధికారులను సంప్రదించాలని, ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని, నామినేషన్ల సమయం లో సమయంలో ఊరేగింపులు జరపరాదు ఎటువంటి బాణాసంచా కాల్చరాదు కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. ఈ సమావేశంలో పవన్ కుమార్, నాగమణి సిబ్బంది పాల్గొన్నారు.