జిల్లా స్థాయి క్విజ్‌లో నకరికల్లు విద్యార్థిని ప్రతిభ ప్రథమ స్థానం సాధించిన కె. రిషిత శ్రీకరి
నకరికల్లు మేజర్ న్యూస్: నరసరావుపేటలోని శంకరభారతీపురం జడ్పీ హైస్కూల్‌లో ఎన్నికల సంఘం నిర్వహించిన జిల్లా స్థాయి ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ క్విజ్ పోటీల్లో నకరికల్లు ఏఎస్పీ జడ్జి ఉన్నత పాఠశాల విద్యార్థిని కె. రిషిత శ్రీకరి ప్రథమ స్థానం సాధించింది. ఈ నెల 20న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆమె ప్రశంసాపత్రం అందుకోనుంది.
ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన రిషితను, ఆమెకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయుడు ఎన్. బాజీ బాబును పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థిని సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేశారు.