నమ్ముకున్న పార్టీలు న్యాయం చేయలేదు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంనాయి బ్రాహ్మణులను రాజకీయ పార్టీలు పట్టించుకోవటం లేదని నాయి బ్రాహ్మణ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాలి దుర్గాప్రసాద్ ఆవేదన వ్యక్తపరిచారు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు
ఆది నుంచి TDP పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులను (మంగలి సామాజిక వర్గం) ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఆ సామాజిక వర్గానికి నామిటెపదవుల్లో గాని జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో మున్సిపాలిటీలో గాని ఎంపీటీసీల్లో జడ్పిటిసి కేటాయించడంలో గాని ఎక్కడా కూడా ఒక్క సీటు కూడా పార్టీ కేటాయించకపోవడం. శోచనీయం. అని
దుర్గాప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నాయి బ్రాహ్మణుల సామాజిక వర్గానికి పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వాలని లేనిపక్షంలో రాబోయే (2029) జనరల్ ఎలక్షన్ మా సత్తా చూపిస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు.