పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన సీఈవో --నిర్మాణ పనులు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సంజీవ్ హోరా
పోలవరం ,మేజర్ న్యూస్: ప్రాజెక్ట్ పనులు బాగా జరుగుతున్నాయి సీఈవో సంజీవ్ హోరా అన్నారు. మంగళవారం ఉదయమే చేరుకున్న పి పి ఏ సభ్య కార్యదర్శి ఎం రఘురాం ,సి ఈ రమేష్ లతో వివరాలను జిల్లా వనరుల శాఖ అధికారులు ను మెగా సంస్థ ప్రతినిధుల్ని అడిగి తెలుసుకున్నారు. అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయనకు వివరించారు, ఈ సందర్భంగా ఆయన గత పర్యటనలో పరిశీలించి ఇచ్చిన సూచనలు సలహాలు ఇటీవల విదేశీ నిపుణుల బృందం పర్యటనలో ఇచ్చిన సలహాలు అమల తీరుని అధికారులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ వస్తున్న తుఫానుల హెచ్చరికల నేపథ్యంలో కాపర్ డ్యాం నడుమ నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థకు అధికారులకు సంజీవ్ సూచించారు. ఇంజనీరింగ్ చీఫ్ రామచంద్ర రావు క్వాలిటీ కంట్రోల్ శేషుబాబు మెగా సంస్థ జీఎం ఎం గంగాధర్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఈ సి ఆర్ ఎఫ్ డామినిర్మాణంలో గ్యాప్ టు జి ఎల్ జి డాష్ హిల్ ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణ పనుల్ని పరిశీలించిన సంజీవ్ , నిర్మాణ ప్రాంతాల్లో పనులు నాణ్యత ప్రమాణాలను అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న లక్ష్యాన్ని కంటే ముందుగా పూర్తి చేయడానికి నిబద్దతో ఉన్నారని అధికారులు, నిర్మాణ సంస్థ పనుల్ని ప్రణాళికల ప్రకారం వేగవంతంగా నిర్దేశించిన లక్ష్యంలో మేరకు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ అధికారులు మెగా సంస్థ ఇంజనీర్లు పాల్గొన్నారు.
రిపోర్టర్ షరీఫ్ పోలవరం ఏలూరు జిల్లా,