BREAKING
ఏకగ్రీవ సర్పంచును అభినందించిన ఎమ్మెల్యే కాకర్ల కావలి చైర్‌పర్సన్ పీఠానికి 18 మంది పోటీ.. 21 నామినేషన్లు దాఖలు రజక సోదరుడిపై దాడి ఘటనపై సంఘం ఆగ్రహం.. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబుతో కమిషనర్ ప్రమీల భేటీ : నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై కీలక చర్చ దిశ మార్చుకున్న అక్వాన్‌ తుఫాన్‌.. ప్రతిష్టాత్మక స్వచ్ఛ అవార్డు ప్రోత్సాహకం అందుకున్న కార్పొరేషన్ సోమశిలలో సాయంత్రం వేళ ఆవుల బెడద.. పట్టించుకోని అధికారులు! రాందాస్ కాలనీలో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నమ్ముకున్న పార్టీలు న్యాయం చేయలేదు ఎంపీపీ ఎన్నికల విప్ నియామక పత్రాన్ని ఎంపీడీవోకు అందజేసిన మన్నారపు రవికుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన సీఈవో --నిర్మాణ పనులు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సంజీవ్ హోరా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యల ఘనంగా వైస్ చైర్మన్ నవీన్ అన్నకి బర్త్‌డే వేడుకలు జిల్లా స్థాయి క్విజ్‌లో నకరికల్లు విద్యార్థిని ప్రతిభ ప్రథమ స్థానం సాధించిన కె. రిషిత శ్రీకరి నామినేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

నామినేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

Select Suryaa Now
నామినేషన్ల ప్రక్రియను   నిబంధనల ప్రకారం అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

 

కర్నూలు, నవంబర్ 17:- రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18, 19, 20 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిర్వహించనున్న నేపథ్యంలో, నామినేషన్ల ప్రక్రియను   నిబంధనల ప్రకారం అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్,  జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల అంశం పై కలెక్టర్ రిటర్నింగ్ అధికారులతో, నోడల్ అధికారులతో, మండల స్పెషల్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ అనంతరం స్క్రూటినీ సమయంలో కూడా నిబంధనల ప్రకారం వ్యవహరించాలన్నారు.   అభ్యర్థి పేరు, ఓటర్ల జాబితాలోని సీరియల్ నంబర్, ప్రతిపాదకుడి పేరు, సీరియల్ నంబర్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అభ్యర్థి కుల ధ్రువీకరణ పత్రం లేదా సంబంధిత డిక్లరేషన్ తప్పనిసరిగా సమర్పించాలన్నారు. అదే విధంగా నిర్ణీత సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలన్నారు. క్రిమినల్ కేసుల వివరాలు, ఆస్తులు, అప్పులకు సంబంధించిన డిక్లరేషన్‌తో పాటు ఎన్నికల ఖర్చుల ఖాతాల నిర్వహణకు సంబంధించిన డిక్లరేషన్ కూడా తప్పనిసరిగా సమర్పించాలన్నారు. నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించని సందర్భాల్లో నామినేషన్ల తిరస్కరణకు చర్యలు తీసుకోవాలన్నారు.

రిటర్నింగ్ అధికారులు మొదట సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించిన అనంతరం వార్డు సభ్యుల నామినేషన్లను పరిశీలించాలన్నారు. ఒక రిటర్నింగ్ అధికారికి రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రామ పంచాయతీల బాధ్యతలు అప్పగించిన సందర్భంలో, గ్రామ పంచాయతీల పేర్లను తెలుగు అక్షర క్రమంలో అమర్చి, ఆ క్రమం ప్రకారం స్క్రూటినీ నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ ముందుగా సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు, అనంతరం వార్డు సభ్యుల నామినేషన్లను పరిశీలించాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు లేదా ఇతర వ్యక్తులు ఓటర్లను ప్రలోభపెట్టడం, వేలం పాటలు నిర్వహించడం వంటి చర్యలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన నిఘా ఉంచాలన్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలన్నారు.  తుది పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా (ఫారం-9) తయారు చేసేటప్పుడు నామినేషన్ పత్రంలో అభ్యర్థి తన పేరును ఏ విధంగా నమోదు చేశారో అదే విధంగా పూర్తి పేరును పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫై చేసిన ఎన్నికల గుర్తుల జాబితా ప్రకారం, అభ్యర్థుల తుది జాబితాను తెలుగు అక్షర క్రమంలో సిద్ధం చేసిన తర్వాత సీరియల్ నంబర్ల వారీగా గుర్తులను కేటాయించాలన్నారు. అభ్యర్థులు తమకు నచ్చిన గుర్తులను ఎంపిక చేసుకునే అవకాశం లేదని, రిటర్నింగ్ అధికారులే నిర్ణీత క్రమంలో గుర్తులను కేటాయించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు సంబంధిత ఉచిత గుర్తుల జాబితాలోని క్రమం ప్రకారం గుర్తులను కేటాయించాలన్నారు. గుర్తుల పేర్లు, వివరాలు, తుది జాబితాలో ఎలాంటి అక్షర దోషాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తుది పోటీ అభ్యర్థుల జాబితా ప్రచురించిన వెంటనే పోస్టల్ బ్యాలెట్ల ముద్రణ, పంపిణీ ప్రక్రియను చేపట్టాలన్నారు. సర్వీస్ ఓటర్లు, ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన సిబ్బందికి నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్లు పంపిణీ చేయాలన్నారు.


స్వీకరించిన నామినేషన్ పత్రాలన్నింటినీ స్కాన్ చేసి డిజిటల్ రూపంలో భద్రపరచడంతో పాటు, వాటి హార్డ్ కాపీలను కూడా అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలన్నారు. తుది అభ్యర్థుల జాబితాను ప్రచురించే ముందు పేర్లు, ఎన్నికల గుర్తులు, సీరియల్ నంబర్లు తదితర వివరాలను మరోసారి పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు ముందుకు వచ్చినప్పుడు, సంబంధిత అభ్యర్థి స్వయంగా ఉపసంహరణ కోరుతున్నట్లు నిర్ధారించుకోవాలన్నారు. ఇతరులు తెలిపిన సమాచారం ఆధారంగా ఉపసంహరణ ప్రక్రియ చేపట్టకూడదన్నారు.  ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు..

టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, ఆదోని ఆర్డీఓ అరుణ దేవి, డిపిఓ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.