బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా ఊటు నరేష్
కందుకూరు, మేజర్ న్యూస్: భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన ఊటు నరేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనకు ఈ అవకాశం కల్పించిన బీజేపీ రాష్ట్ర యువమోర్చా నాయకత్వానికి, రంగారెడ్డి జిల్లా నాయకత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఊటు నరేష్ మాట్లాడుతూ… బీజేపీ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి, యువతను పార్టీ వైపు ఆకర్షించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని నరేష్ తెలిపారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్, కందుకూరు, రంగారెడ్డి జిల్లా.