BREAKING
బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా ఊటు నరేష్ జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధిగా కళ్ళెం సూర్య ప్రకాష్ చెత్త డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు .... ఎంసీ పల్లి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్. రత్నమ్మ చౌదరి నామినేషన్ దాఖలు.. దేవనకొండ మండలంలో 168 నామినేషన్లు పాలకుర్తిలో రైతు సదస్సు – వ్యవసాయ ప్రదర్శన పారిశుద్ధ్య కార్మికులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి

కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్

Select Suryaa Now
 కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్

రంగారెడ్డి : జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన క్రషర్‌ యూనిట్ల నుంచి వెలువడుతున్న దుమ్ము కాలుష్యం కిష్టాపూర్‌, నంచెర్ల గ్రామాల రైతులకు శాపంగా మారింది. క్రషర్‌ దుమ్ము పంట పొలాలపై పేరుకుపోతుండటంతో పంటల ఎదుగుదల దెబ్బతింటోందని, దిగుబడులు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ హేమా సుదర్శన్‌ జిల్లోజు ఆవేదన వ్యక్తం చేశారు.

చేవెళ్ల మండల పరిధిలోని టీఎస్‌పీఏ నుంచి మన్నెగూడ వరకు చేపడుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా నిర్వహిస్తున్న క్రషర్‌ యూనిట్ల నుంచి పెద్ద ఎత్తున దుమ్ము వెలువడుతోందని ఆమె తెలిపారు. ఈ దుమ్ము సమీపంలోని పంట పొలాలపై పేరుకుపోవడంతో పంటల ఎదుగుదల మందగించి, దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి సాగు చేసిన రైతులు పంటలు దెబ్బతింటుండటంతో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.

ఈ సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రైతుల పంటలు నష్టపోతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల పేరుతో కార్పొరేట్‌ సంస్థలు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం రైతుల జీవనోపాధిని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.

రోడ్డు నిర్మాణం అవసరమే అయినప్పటికీ, దాని వల్ల రైతులకు నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో పాటు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి క్రషర్‌ కాలుష్యాన్ని నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని, బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని కోరారు.

కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించని క్రషర్‌ యూనిట్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, క్రషర్‌ పరిసరాల్లో నిరంతరం నీటిని పిచికారీ చేసి దుమ్ము వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఆమ్‌ ఆద్మీ పార్టీ వారి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని హేమా సుదర్శన్‌ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ కిసాన్‌ వింగ్‌ కన్వీనర్‌ నీరటి ఆంజనేయులు ముదిరాజ్‌, రాష్ట్ర నాయకులు బాబూలాల్‌ పవార్‌, తేజ ఆచార్య, స్థానిక రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొని బాధిత రైతులకు సంఘీభావం తెలిపారు.

వి శ్రీనివాసచారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్