BREAKING
బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా ఊటు నరేష్ జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధిగా కళ్ళెం సూర్య ప్రకాష్ చెత్త డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు .... ఎంసీ పల్లి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్. రత్నమ్మ చౌదరి నామినేషన్ దాఖలు.. దేవనకొండ మండలంలో 168 నామినేషన్లు పాలకుర్తిలో రైతు సదస్సు – వ్యవసాయ ప్రదర్శన పారిశుద్ధ్య కార్మికులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి

అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం

Select Suryaa Now
అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి  శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం
 
 
అవనిగడ్డ, మేజర్ న్యూస్: వయసు చిన్నదైనా.. ప్రతిభలో మాత్రం జాతీయ స్థాయిలో సత్తా చాటింది దివిసీమ చిన్నారి మలిశెట్టి సరయు. అండమాన్‌ నికోబార్ దీవుల్లో నిర్వహించిన 16వ కల్చరల్ ఒలంపియాడ్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌-2026 పోటీల్లో శివతాండవ నృత్య ప్రదర్శనతో ద్వితీయ స్థానం సాధించి రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
గ్లోబల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్, అఖిల భారతీయ సాంస్కృతిక సంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు జరిగిన ఈ పోటీల్లో సెమీ క్లాసికల్ సోలో డాన్స్ జూనియర్ రెపర్టరీ విభాగంలో సరయు పలువురు చిన్నారులతో పోటీపడి ప్రతిభ కనబరిచింది. యునెస్కో అధికారిక భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ పోటీల్లో రజత పతకం సాధించడం విశేషం.
దివిసీమ నాగాయలంక కు చెందిన సీనియర్ ఫొటోగ్రాఫర్, జర్నలిస్ట్ సింహాద్రి కృష్ణప్రసాద్ మనవరాలైన సరయు.. విజేత, మలిశెట్టి వాసు దంపతుల కుమార్తె. తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడ నృత్త నాట్యాలయం డాన్స్ అకాడమీ అధినేత్రి, గురువు కంబాల చైతన్య వద్ద సరయు నృత్య శిక్షణ పొందుతోంది. 2025లో హైదరాబాద్ రవీంద్రభారతిలో నృత్య రంగ ప్రవేశం చేసింది.
ఈ ఏడాది మే, జూన్ నెలల్లో పుణెలో జరిగిన నేషనల్ ఆర్ట్ అండ్ టాలెంట్ సెర్చ్ కార్నివాల్‌లో మూడు సీజన్ల టాక్పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. దీంతో అండమాన్‌లో జరిగిన 16వ కల్చరల్ ఒలంపియాడ్‌కు నేరుగా అర్హత పొందింది. పుణెలో అర్హత సాధించిన 480 మంది కళాకారులు అండమాన్‌లో నృత్యం, గాత్రం, వాయిద్యం, ఏకపాత్రాభినయం విభాగాల్లో పోటీపడ్డారు.
ఇదిలా ఉండగా, నృత్త నాట్యాలయం నుంచి పాల్గొన్న గీతిక, వాత్సల్య ఇతర విభాగాల్లో తృతీయ స్థానాలు సాధించినట్లు గురువు చైతన్య తెలిపారు. సరయు సాధించిన విజయానికి గురువు అందించిన శిక్షణ, చిన్నారి అంకితభావమే కారణమని తల్లిదండ్రులు విజేత, వాసు పేర్కొంటూ గురువుకు కృతజ్ఞతలు తెలిపారు.
✍️ అజంతా శ్రీనివాస్ అవనిగడ్డ కృష్ణాజిల్లా