BREAKING
బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా ఊటు నరేష్ జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధిగా కళ్ళెం సూర్య ప్రకాష్ చెత్త డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు .... ఎంసీ పల్లి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్. రత్నమ్మ చౌదరి నామినేషన్ దాఖలు.. దేవనకొండ మండలంలో 168 నామినేషన్లు పాలకుర్తిలో రైతు సదస్సు – వ్యవసాయ ప్రదర్శన పారిశుద్ధ్య కార్మికులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి

శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో

Select Suryaa Now
శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో


కర్నూలు: విద్యార్థుల్లో ఆంగ్ల భాషా పరిజ్ఞానం, వ్యాకరణ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో కర్నూలు వెంకటరమణ కాలనీలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ కర్నూలు-1 బ్రాంచ్‌లో ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పోను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, సెంటెన్స్ స్ట్రక్చర్స్ వంటి ఆంగ్ల వ్యాకరణ అంశాలపై వివిధ నమూనాలు, చార్టులు ఏర్పాటు చేసి తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఏజీఎం సురేష్ మాట్లాడుతూ.. పుస్తకాలకే పరిమితం కాకుండా, ఆచరణాత్మకంగా, ఆసక్తికరమైన రీతిలో ఆంగ్ల వ్యాకరణాన్ని నేర్చుకునేలా చేయడమే ఈ ఎక్స్‌పో ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
విద్యార్థుల సృజనాత్మకత, ప్రతిభ, కృషిని పాఠశాల ప్రిన్సిపల్ మంజుల, ఉపాధ్యాయులు అభినందించారు. ఇలాంటి వినూత్న విద్యా కార్యక్రమాలు విద్యార్థుల్లో అభ్యసన ఆసక్తిని పెంపొందించడంతో పాటు సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.