చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు.
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌కు టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు షణ్ముగం కుటుంబ సమేతంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమారుడు చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం కల్పించిన నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలుసుకుని ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యేకు గజమాల వేసి, శాలువా కప్పి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై నమ్మకం ఉంచి కుమారుడు చందుకు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అనంతరం షణ్ముగం మాట్లాడుతూ, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తమ కుటుంబంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. 52వ వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధి పనుల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఎమ్మెల్యే సూచనలు, ఆశీస్సులతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ ఎమ్మెల్యేకు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయనకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవ కుమార్