BREAKING
టెక్నాలజీతో పరీక్షల్లో కొత్త తరహా మోసాలు... నసనకోట టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా చిన్న ముత్యాలప్ప నామినేషన్ దాఖలు.. అర్హులైన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు కృషి చేస్తా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం క్లస్టర్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి పంపిణీ పంట కోత ప్రయోగాలు 24న పుల్లూరుబండపై సామూహిక సత్యనారాయణ వ్రతాలు జీవ వనరుల కేంద్రం సమగ్ర సస్య రక్షణ అవగాహన సమావేశం ఆక్వాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈనెల19న వెల్దుర్తి ఎంపీపీ ఎన్నిక ... టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో భారీ మార్పులకు సంకేతం: సత్య నాదెళ్ల! బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా ఊటు నరేష్ జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధిగా కళ్ళెం సూర్య ప్రకాష్ చెత్త డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు .... ఎంసీ పల్లి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్. రత్నమ్మ చౌదరి నామినేషన్ దాఖలు.. దేవనకొండ మండలంలో 168 నామినేషన్లు

పారిశుద్ధ్య కార్మికులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ

Select Suryaa Now
పారిశుద్ధ్య కార్మికులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ
 
 
అవనిగడ్డ, మేజర్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అవనిగడ్డ గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు మంగళవారం రగ్గులు పంపిణీ చేశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నా రవిశంకర్, నియోజకవర్గ అధ్యక్షుడు అలపర్తి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. వార్షికోత్సవంలో భాగంగా నియోజకవర్గంలోని కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల గ్రామాల్లోనూ దశలవారీగా పారిశుద్ధ్య కార్మికులకు రగ్గులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తొలివిడతగా అవనిగడ్డలో లెజెండ్స్ సోషల్ సర్వీసెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పూతబోయిన అయ్యప్ప స్వామి (అమెరికా) సహకారంతో 50 మంది కార్మికులకు నాణ్యమైన రగ్గులు అందజేసినట్లు పేర్కొన్నారు.
 
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి తోట శ్రీనివాసరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు కోట యూరి గగరిన్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి లంకే శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులు కుంపటి బాబురావు, ఇమ్మడిశెట్టి రామారావు, కోశాధికారి మోపిదేవి అమ్మయ్య, కార్యవర్గ సభ్యులు కంచర్లపల్లి వెంకట నాంచారయ్య, అద్దంకి కృష్ణ, కుంపటి వెంకట సుబ్బారావు, జర్నలిస్టులు సామర్ల మల్లికార్జునరావు, సింహాద్రి జయరామ్, పసుపుర్తి మురళీకృష్ణ, బత్తుల నల్లబాబు తదితరులు పాల్గొన్నారు.✍️ అజంతా శ్రీనివాస్ అవనిగడ్డ కృష్ణాజిల్లా