BREAKING
పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గాజులరామారంలో ఘనంగా శ్రీశ్రీ కోటి దీపోత్సవం వెంకన్న ఆలయ పున నిర్మాణ పనులు పరిశీలన రుద్రంపేట పంచాయతీ వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ మహబూబ్ బీ నామినేషన్ అఫ్గానిస్తాన్‌పై జింబాబ్వే సంచలన విజయం, ఉత్కంఠ పోరులో రెండో టెస్టుతో పాటు సిరీస్ కైవసం జనసేన బలపరిచిన పరింపూడి సర్పంచ్ అభ్యర్థి కోడూరి భారతి --అఖండ మెజారిటీతో గెలిపిద్దాం : ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాజీ సీఎం నల్లారిని కలిసిన జడ్పిటిసి జబ్బల మీనా : భాజపా నేత జబ్బల శ్రీనివాసులుకు అభినందనలు టెక్నాలజీతో పరీక్షల్లో కొత్త తరహా మోసాలు... నసనకోట టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా చిన్న ముత్యాలప్ప నామినేషన్ దాఖలు.. అర్హులైన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు కృషి చేస్తా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం క్లస్టర్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి పంపిణీ పంట కోత ప్రయోగాలు 24న పుల్లూరుబండపై సామూహిక సత్యనారాయణ వ్రతాలు జీవ వనరుల కేంద్రం సమగ్ర సస్య రక్షణ అవగాహన సమావేశం

క్లస్టర్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి పంపిణీ

Select Suryaa Now
క్లస్టర్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి పంపిణీ

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.అభ్యర్థులు తమ గ్రామపంచాయతీ పరిధిలోని క్లస్టర్ కేంద్రంలో సర్పంచి,వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేయాలి.ఇందుకు అవసరమైన ఎన్నికల సామగ్రిని అధికారులు పంపిణీ చేశారు.ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన,22న అప్పీళ్ల స్వీకరణ,23న పరిష్కారం చేపడతారు.24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.అనంతరం తుది అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.29న ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి,అదే రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.అవసరమైతే 30న రీపోలింగ్ నిర్వహిస్తారు.అభ్యర్థులు నామినేషన్ సమయంలో కుల ధ్రువీకరణ పత్రం,ఆస్తులు,అప్పులు,విద్యార్హతలు,క్రిమినల్ కేసులకు సంబంధించిన డిక్లరేషన్లతో పాటు అవసరమైన పత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు.ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా,పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.