BREAKING
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యల ఘనంగా వైస్ చైర్మన్ నవీన్ అన్నకి బర్త్‌డే వేడుకలు జిల్లా స్థాయి క్విజ్‌లో నకరికల్లు విద్యార్థిని ప్రతిభ ప్రథమ స్థానం సాధించిన కె. రిషిత శ్రీకరి నామినేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* షాహీనా కుటుంబానికి అండగా హరీష్ రావు ఆడబిడ్డలకు అండగా రవాణా శాఖ అధికారి గంతి మర్రి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా కురుబ పరంధామ నామినేషన్ దాఖలు.. సర్పంచ్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలు.. నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ చెయ్యి లేదు 'చేయూత' లేదు..ఒంటి చేత్తో కుటుంబ భారాన్నిమోస్తున్న ఓ దివ్యాంగుని దీన గాధ. కొత్త చైర్మన్ తొలి అడుగు నిత్యావసర సరుకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడవద్దు .. తాసిల్దార్ శ్రీనివాసులు. బిజెపిలోకి చేరికలు పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

గాజులరామారంలో ఘనంగా శ్రీశ్రీ కోటి దీపోత్సవం

Select Suryaa Now
గాజులరామారంలో ఘనంగా శ్రీశ్రీ కోటి దీపోత్సవం
జీడిమెట్ల మేజర్ న్యూస్  గాజులరామారంలో శ్రీశ్రీశ్రీ నకులేశ్వరి దేవి సిద్ధి పీఠం ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని  మంగళవారం నిర్వహించిన శ్రీశ్రీ కోటి దీపోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేకేఎం ట్రస్ట్ చైర్మన్, మేడ్చల్–మల్కాజిగిరి డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోటి దీపోత్సవంలో పాల్గొన్న కూన శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో విశిష్టత ఉందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిభావాన్ని, ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు మన సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించేందుకు దోహదపడతాయని అన్నారు. ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. అనంతరం కమిటీ సభ్యులు కూన శ్రీనివాస్ గౌడ్‌ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోటి దీపోత్సవ నిర్వాహకులతో పాటు స్థానిక నాయకులు బుచ్చిరెడ్డి, పున్నారెడ్డి, బాలప్ప, అంజిరెడ్డి, యం. సాగర్, దంపబోయిన శ్రీనివాస్, రాజిరెడ్డి, గుబ్బల రమణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.