నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్
నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్
హొళగుంద,సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో జరుగుతున్న సర్పంచ్,వార్డు స్థానాలకు నామినేషన్ దాఖల సచివాలయ కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్జీ మంగళవారం తనిఖీ చేశారు.మండల పరిధిలోని సమ్మతగేరి,ఎల్లార్తి ఇతర కేంద్రాలను సందర్శించి స్థానాలకు నామినేషన్ దాఖలు ఎలా జరుగుతున్నాయని అధికారులను ఆరాతీశారు. అభ్యర్థులు ప్రశాంతంగా నామినేషన్ దాఖలను చేస్తున్నట్లు అధికారులు ఆయనకు తెలియజేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ లక్ష్మీరాజు, ఎంపీడీవో సయ్యద్ ఉమర్, ఎస్సై దిలీప్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు.