కొత్త చైర్మన్ తొలి అడుగు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన నల్లా శ్రీధర్ మంగళవారం జిల్లా కలెక్టర్ డా.ఆర్. మహేష్ కుమార్‌ను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతన చైర్మన్‌కు అభినందనలు తెలిపారు. ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని నల్లా శ్రీధర్ కలెక్టర్‌ను ఆహ్వానించారు. అనంతరం అమలాపురం పట్టణ అభివృద్ధి, ప్రధాన సమస్యగా ఉన్న డంపింగ్ యార్డు అంశంపై చర్చించారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపించి సహకరించాలని కలెక్టర్‌ను కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.