సర్పంచ్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలు..
తంబళ్లపల్లె, మేజర్ న్యూస్, తంబళ్లపల్లె మండలం లోని 21 పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల కేంద్రాలను ఎంపీడీవో ఉషారాణి ప్రకటించారు. తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తంబళ్లపల్లె, పంచాలమర్రి, ఎర్రసానిపల్లి పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల కేంద్రం, పరసతోపు స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పరసతోపు, గుండ్లపల్లి, దిగువపాలెం, గంగిరెడ్డిపల్లి పంచాయతీలు, గోపిదిన్ని స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గోపి దిన్ని,కొటాల, ఆర్ఎన్ తాండ, జుంజుర పెంట పంచాయతీలు, కోసువారిపల్లి స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కోసువారి పల్లి, బాలిరెడ్డిగారి పల్లి, కన్నె మడుగు, మర్రిమాకులపల్లి, ఎద్దులవారి పల్లి పంచాయతీలు, కోటకొండ స్వర్ణ గ్రామపంచాయతీ కార్యాలయంలో కోటకొండ, ఎగువ సుగాలి తాండ, కుక్క రాజుపల్లి, రెడ్డికోట, రేణు మాకులపల్లి పంచాయతీల నామినేషన్ల కేంద్రాలుగా ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించినట్లు ఎంపీడీవో ఉషారాణి తెలిపారు.