పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు.
తంబళ్లపల్లె, మేజర్ న్యూస్, తంబళ్లపల్లె మండల కేంద్రంలోని శ్రీ సాయి విద్యా మందిర్ లో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల లో భాగంగా మంగళవారం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఉదయం పాఠశాలలో గ్రంథాలయ అధికారి జిలాని భాష, పాఠశాల హెడ్మాస్టర్ సాజిదా ల ఆధ్వర్యంలో పలు తరగతులకు చెందిన విద్యార్థులు చిత్రలేఖనం పోటీల లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు గ్రంథాలయాల లోని పలు రకాల పుస్తకాలను అధ్యయనం చేసి విజ్ఞానంతో పాటు మానసిక ఉల్లాసం అలవర్చుకోవాలని హెడ్మాస్టర్ సాజిద సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
పి. గౌరి శంకర్, స్టాఫ్ రిపోర్టర్, తంబళ్లపల్లె