బిజెపిలోకి చేరికలు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంతూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పరిధిలోని గోకవరం గ్రామంలో బీజేపీ దళిత నాయకులు వరసాల ప్రసాద్, 17 వార్డ్ అభ్యర్థి మందపాటి సతీష్ సారథ్యంలో గోకవరం గ్రామం పాత గుబ్బాలమ్మ వీధికి చెందిన సుమారు 22 మంది దళితులు భారతీయ జనతా పార్టీలో చేరారు. స్థానిక తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు నూతనంగా పార్టీలో చేరిన వారికి బీజేపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కంబాల శ్రీనివాసరావు పేద ప్రజలకు అందిస్తున్న సేవలు, ఆపదలో ఉన్న నిరుపేద, దళిత కుటుంబాలకు చేస్తున్న ఆర్థిక సహాయాలు, నిరంతరం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, పట్ల ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరినట్లు వెల్లడించారు. ప్రజలకు అండగా నిలుస్తూ, కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కంబాల శ్రీనివాసరావు సేవా దృక్పథం తమను ఎంతో ప్రభావితం చేసిందన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి కోసం అమలవుతున్న సంక్షేమ, కార్యక్రమాల పట్ల విశ్వాసంతో బీజేపీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కంబాల శ్రీనివాసరావు నాయకత్వంలో పనిచేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.