జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధిగా కళ్ళెం సూర్య ప్రకాష్
షాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 17)
రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) అధికార ప్రతినిధిగా షాబాద్ మండలం బోడంపహాడ్ గ్రామానికి చెందిన కళ్ళెం సూర్యప్రకాష్ నియమితులయ్యారు. విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో చురుగ్గా పనిచేస్తూ విద్యార్థుల సమస్యలపై పోరాడిన ఆయన సేవలను గుర్తించిన పార్టీ నాయకత్వం ఈ బాధ్యతలు అప్పగించింది.2013లో కళాశాల అధ్యక్షుడిగా ఎన్నికైన సూర్యప్రకాష్ అనంతరం షాబాద్ కేంద్రంగా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఏబీవీపీలో జిల్లా, రాష్ట్ర స్థాయి బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విభాగ్ కన్వీనర్‌గా పనిచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతానని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. తనకు బాధ్యతలు అప్పగించిన బీజేపీ, బీజేవైఎం రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.