BREAKING
చెత్త డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు .... ఎంసీ పల్లి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్. రత్నమ్మ చౌదరి నామినేషన్ దాఖలు.. దేవనకొండ మండలంలో 168 నామినేషన్లు పాలకుర్తిలో రైతు సదస్సు – వ్యవసాయ ప్రదర్శన పారిశుద్ధ్య కార్మికులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి

మీషో–యూట్యూబ్ భాగస్వామ్యం.. క్రియేటర్లకు ఆదాయ అవకాశాలు

Select Suryaa Now
మీషో–యూట్యూబ్ భాగస్వామ్యం.. క్రియేటర్లకు ఆదాయ అవకాశాలు
హైదరాబాద్,మేజర్ న్యూస్ ప్రతినిధి : దేశీయ ఈ-కామర్స్ రంగంలో కంటెంట్ ఆధారిత వ్యాపారాన్ని విస్తరించే దిశగా మీషో కీలక అడుగు వేసింది. యూట్యూబ్ షాపింగ్‌తో భాగస్వామ్యం ద్వారా తన అఫిలియేట్ మార్కెటింగ్ వ్యవస్థను మరింత విస్తరించనుంది. ఈ ఒప్పందంతో అర్హులైన యూట్యూబ్ క్రియేటర్లు తమ వీడియోలు, షార్ట్స్, లైవ్‌స్ట్రీమ్‌లలో మీషో ఉత్పత్తులను ట్యాగ్ చేసి, వాటి విక్రయాలపై కమీషన్లు పొందే అవకాశం కల్పించింది.
ఈ భాగస్వామ్యంలో భాగంగా 40 కేటగిరీల్లో 3 కోట్లకు పైగా ఉత్పత్తులు, 2 లక్షలకు పైగా విక్రేతల నెట్‌వర్క్ క్రియేటర్లకు అందుబాటులోకి రానుంది. కనీసం 500 మంది సబ్‌స్క్రైబర్లు కలిగిన క్రియేటర్లు సైతం యూట్యూబ్ నిర్దేశించిన అర్హతలు పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీషో క్రియేటర్ క్లబ్‌లో 81 శాతం మంది మెట్రో నగరాలకు వెలుపల ప్రాంతాలకు చెందినవారు కాగా, క్రియేటర్లలో 90 శాతం మంది నానో క్రియేటర్లే ఉన్నారు. చిన్న పట్టణాలు, ప్రాంతీయ భాషా కంటెంట్ సృష్టికర్తలకు డిజిటల్ వాణిజ్యంలో అవకాశాలు కల్పించడంపై సంస్థ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రానున్న నెలల్లో 2 లక్షలకు పైగా క్రియేటర్లను యూట్యూబ్ షాపింగ్‌తో అనుసంధానించా లని మీషో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా విక్రేతలకు కొత్త మార్కెట్లు, క్రియేటర్లకు అదనపు ఆదాయం, వినియోగదారులకు సులభమైన ఉత్పత్తుల కొనుగోలు అవకాశాలు లభించనున్నాయి.