telangana
కుత్బుల్లాపూర్ ని. వ. పరిధిలోని గాజులరామారం డివిజన్ లో గిరివర్ధనరెడ్డి పర్యటన
.హైదరాబాద్, ఆల్వాల్, మేజర్ న్యూస్ :కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం డివిజన్ పరిధిలో మంగళవారం మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి బిజెపి డివిజన్ అధ్యక్షులు డివిజన్ పర్యటన
కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం డివిజన్‌లో బీజేపీ డివిజన్ అధ్యక్షులు సాయి ప్రతాప్ గారి ఆధ్వర్యంలో బీజేపీ మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి గారు డివిజన్ లో సాయిప్రతాప్ ఆధ్వర్యంలో స్థానిక బిజెపి నాయకులతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రగిరి నగర్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి, నిర్వహణకు సంబంధించిన సమస్యలపై ఆలయ కమిటీ సభ్యులతో సమావేశమై చర్చించారు. తదుపరి డివిజన్ నాయకులతో కలిసి భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక కమ్యూనిటీ హాల్‌లో డివిజన్‌లోని వివిధ వర్గాల ప్రజలతో సమావేశం నిర్వహించి, వారి సమస్యలు, స్థానికంగా నెలకొన్న ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
డివిజన్ లో కార్యకర్త ఇంటి లో భోజనం చేశారు.
ఈ సందర్భంగా గిరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. గాజులరామారం డివిజన్‌లో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
అనంతరం డివిజన్‌లోని సీనియర్ నాయకుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావడం, పార్టీ కార్యక్రమాలను ప్రతి బూత్‌కు తీసుకెళ్లడం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం చేస్తూ, గాజులరామారం డివిజన్‌లో బీజేపీని మరింత బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మున్సిపల్ సెల్ కో కన్వీనర్ రావుల శేషగిరి రావు గారు , బి. జె. వై. ఎమ్. (BJYM) జిల్లా అధ్యక్షులు శ్రీనాథ్ జిల్లా నాయకులు రచ్చ చక్రధర్, కంది శ్రీరాముల, భీమ్ రావు, డివిజన్ అధ్యక్షులు సాయి ప్రతాప్, శారద ముఖ్య నాయకులు సాయినేత నాయకులు కార్యకర్తలు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు