BREAKING
రెండో విడత గ్రామ సర్పంచ్ నామినేషన్లకు పటిష్ట భద్రతా ఏర్పాటు ‘బై’ రేటింగ్ కొనసాగిస్తూ రూ. 3,820 టార్గెట్ ప్రైస్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్! కేన్స్ టెక్నాలజీ షేర్లపై బ్రోకరేజ్ విశ్లేషణ దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్ విడుదల, వ్యోమగామి కావాలనుకునే అమ్మాయికి అండగా హీరో విద్యార్థులకు ప్రాథమిక హక్కులపై అవగాహన కార్యక్రమం.. ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ విస్తృత దాడులు.. కర్ణాటక మద్యం స్వాధీనం. బ్రాకరేజ్ రిపోర్ట్: ఏబీబీ ఇండియా, రిలాక్సో ఫుట్‌వేర్ త్రైమాసిక ఫలితాల విశ్లేషణ & హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కొత్త టార్గెట్ ప్రైస్‌లు! రెవెన్యూ వసూళ్లపై సమీక్ష.. రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం.. వంద శాతం పన్నుల వసూలుకు మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్ రావు ఆదేశాలు.. కలెక్టర్ ఆఫీసు గ్రంథాలయమునకు పుస్తకాల వితరణ మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ టాక్ షో ‘మెగావర్స్’లోకి కోలీవుడ్ స్టార్ జంట సూర్య మరియు జ్యోతిక మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి 58వ పుట్టినరోజు వేడుకలు బి.వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి భారత ఉపాధి మార్కెట్‌లో సానుకూల సంకేతాలు.. తిరుపతి డిప్యూటీ మేయర్‌గా శైలజ వేణుగోపాల్‌కు అవకాశం కల్పించాలి నేరేడ్‌మెట్, కాకతీయ నగర్ డివిజన్లలో రూ.2.20 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం ఈ నెల 19న పారా క్రీడాకారుల జిల్లా స్థాయి ఎంపికలు - పోస్టర్ లాంచ్

ఇళ్ల స్థలాల సాధనకు జర్నలిస్టుల మహాధర్నా

Select Suryaa Now
ఇళ్ల స్థలాల సాధనకు జర్నలిస్టుల మహాధర్నా

ఇళ్ల స్థలాల సాధనకు జర్నలిస్టుల మహాధర్నా

సూర్య ప్రతినిధి :  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనే డిమాండ్‌తో ఈ నెల 20న ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు మద్దతుగా పాల్గొంటారని వెల్లడించారు. గ్రేటర్ పరిధిలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు గృహ వసతి కల్పించేందుకు 2008లో గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ(రిజి. నం.163/2008) ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సుమారు 1,300 మంది సభ్యులు గత 18 ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.ఎన్నికల సమయంలో జర్నలిస్టుల సంక్షేమానికి ఐదు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సమస్యలను పరిష్కరించలేదని ఆరోపించారు. ఇళ్ల స్థలాల విషయంలో హామీలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 20న జరిగే మహాధర్నాతోనైనా ప్రభుత్వం స్పందించి, ప్రత్యేక జీవో ద్వారా గ్రేటర్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.