తిరుపతి డిప్యూటీ మేయర్‌గా శైలజ వేణుగోపాల్‌కు అవకాశం కల్పించాలి
బీసీ మహిళా నాయకురాలికి సముచిత గుర్తింపు ఇవ్వాలి
కూటమి పెద్దలకు ఏపీ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి హేమావతి విజ్ఞప్తి
విద్యార్హత, రాజకీయ అనుభవం, ప్రజాసేవ ఆమెకు ప్రత్యేక అర్హతలు
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్:తిరుపతి నగర డిప్యూటీ మేయర్ పదవికి బీసీ మహిళా నాయకురాలు తిరుత్తణి శైలజ వేణుగోపాల్‌కు అవకాశం కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి హేమావతి కూటమి ప్రభుత్వ పెద్దలను కోరారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలికి ఉన్నత పదవి కేటాయించడం ద్వారా బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా సముచిత గుర్తింపు ఇచ్చినట్లవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా హేమావతి మాట్లాడుతూ శైలజ వేణుగోపాల్ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజాసేవ పట్ల అంకితభావం, రాజకీయ అనుభవం, ఉన్నత విద్యార్హతలు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయని పేర్కొన్నారు. సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి కార్పొరేటర్‌గా విజయం సాధించడం ఆమె ప్రజాబలానికి నిదర్శనమన్నారు.శైలజ వేణుగోపాల్ కుటుంబం కూడా ప్రజాసేవ, రాజకీయ రంగాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ సమాజానికి సేవలందిస్తోందని హేమావతి తెలిపారు. బీసీ వర్గాల అభ్యున్నతికి, మహిళల రాజకీయ భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించాలని కోరారు.తిరుపతి నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కలిగి, ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం సేవలందిస్తున్న శైలజ వేణుగోపాల్‌కు డిప్యూటీ మేయర్ పదవి కల్పించడం సముచిత నిర్ణయమవుతుందని హేమావతి అభిప్రాయపడ్డారు.బీసీ మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రజాసేవకు గుర్తింపుగా తిరుత్తణి శైలజ వేణుగోపాల్‌కు డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించాలని కూటమి ప్రభుత్వ పెద్దలు, పార్టీ నాయకత్వాన్ని హేమావతి మరో సారి విజ్ఞప్తి చేశారు.
ఉమా శంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.