వలస గ్రామపంచాయతీ సర్పంచ్ రేసులో బిఎస్ నాగరాజు
అమరాపురం మేజర్ న్యూస్ నవంబరు 17: మండల పరిధిలోని వలస గ్రామ పంచాయతీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వలస గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రేసులో తాను ముందున్నట్లు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు బి.ఎస్. నాగరాజు ప్రకటించారు. కూటమి తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా, కూటమి నాయకులు మరియు కార్యకర్తల సహకారంతో ఎన్నికల బరిలో నిలవడానికి ఆసక్తి చూపుతున్నట్లు బి.ఎస్. నాగరాజు తెలిపారు.