రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా టిడిపి మద్దతుదారుడు బిల్లే నాగరాజు యాదవ్ నామినేషన్
- భారీగా తరలివచ్చిన టిడిపి నాయకులు ,కార్యకర్తలు
- అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : అనంతపురం రూరల్ మండలం రాచానుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టిడిపి మద్దతుదారుడు బిల్లే నాగరాజు యాదవ్.. మంగళవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 10 గంటలకు రాచానుపల్లి, సిండికేట్ నగర్ నుంచి టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలసి తొలుత గ్రామంలో.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ... బైకులలో నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనగా వచ్చి... అనంతపురం రూరల్ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రంలో.. బిల్లే నాగరాజు యాదవ్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ, యువ నేతలు పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో రెండున్నర సంవత్సరాలు అధికారంలో ఉంటుందని, రాచానుపల్లి గ్రామపంచాయతీ ప్రజలు... ఆశీర్వదించి.. నన్ను సర్పంచిగా గెలిపిస్తే.. ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ సహకారంతో.. గ్రామ పంచాయతీలో.. రోడ్లు లేని కాలనీలకు సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కారం, కాలువలు, డ్రైనేజీల నిర్మాణం, పంచాయతీనీ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. ప్రభుత్వ అందించే సంక్షేమ పథకాలను.. పంచాయతీలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా .. చొరవ చూపుతానని తెలిపారు. గ్రామ ప్రజలు ఆశీర్వదించి .. సర్పంచ్ గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో టిడిపి మండల, రాచానుపల్లి గ్రామపంచాయతీ టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.