BREAKING
చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. ఐదు రోజుల్లో షాబాద్ మండలంలో ఇంటింటి సర్వే పూర్తిచేయాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ పేద విద్యార్థులకు సాయం అభినందనీయం అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి మీషో–యూట్యూబ్ భాగస్వామ్యం.. క్రియేటర్లకు ఆదాయ అవకాశాలు కురవంక పంచాయతీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తాం : కూటమి సర్పంచ్ అభ్యర్థిని శ్రీవిద్యకు మద్ధతు ఇవ్వండి : కురవంక టిడిపి ఇన్చార్జ్ పసుపులేటి వినోద్ కుమార్ విజ్ఞప్తి లక్షలాది మంది విద్యార్థులకు పిలుపు - 400లకు పైగా విద్యా సంస్థలకు ఆహ్వానం

మున్సిపాలిటీకి రావాల్సిన ఎగ్జిబిషన్ బకాయి వసూలు చేయాలి

Select Suryaa Now
మున్సిపాలిటీకి రావాల్సిన ఎగ్జిబిషన్ బకాయి వసూలు చేయాలి

ప్రొద్దుటూరు, నవంబర్ 17 మేజర్ న్యూస్ : ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఎగ్జిబిషన్ నిర్వహణకు సంబంధించి భారీగా అవినీతి జరిగిందని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల రోడ్డులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ వేలంలో రూ.2.15 కోట్లకు దక్కించుకున్న నిర్వాహకులు ఇంకా రూ.1.65 లక్షలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి స్పందించడం లేదని విమర్శించారు. గెజిట్ నిబంధనల ప్రకారం వేలంలో అధిక పాట పాడిన వ్యక్తి ఐదు రోజుల్లోపు పూర్తి మొత్తాన్ని చెల్లించిన తర్వాతే ఎగ్జిబిషన్ ప్రారంభించాల్సి ఉంటుందని, అయితే నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ కమిషనర్ అనుమతులు జారీ చేశారని ఆరోపించారు. నిర్వాహకుల నుంచి గెజిట్‌కు విరుద్ధంగా అఫిడవిట్ ఎలా స్వీకరించారని, కలెక్టర్ లేదా మున్సిపల్ ప్రత్యేక అధికారి అయిన జాయింట్ కలెక్టర్ ఈ వ్యవహారంలో ఏ విధంగా సహకరించారని ప్రశ్నించారు. అఫిడవిట్ ప్రకారం నిర్వాహకులు నగదు చెల్లించారా లేదా అన్నది అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒక్క రూపాయి అదనంగా స్టాంపు విక్రయించినా సహించబోమని గతంలో ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే, ప్రస్తుతం మున్సిపాలిటీకి రావాల్సిన ఎగ్జిబిషన్ బకాయిల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ఎగ్జిబిషన్లకు సంబంధించిన సొమ్ము చెల్లించకుండా నిర్వాహకులు బకాయిలు పెట్టారని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ ఎగ్జిబిషన్ ప్రాంతానికి వెళ్లడం కేవలం ప్రచార చిత్రాల కోసమేనని విమర్శించారు. మున్సిపాలిటీకి రావాల్సిన రూ.1.63 కోట్ల ఎగ్జిబిషన్ ఆదాయం, మున్సిపల్ స్థలాల వ్యవహారంపై ప్రజలు ప్రశ్నించినా స్పందన లేకపోవడంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని తెలిపారు. ఎగ్జిబిషన్ సామగ్రిని సీజ్ చేసినట్లు కమిషనర్ లేఖ ఇచ్చి, నిర్వాహకులు కోర్టును ఆశ్రయించేలా వ్యవహరించేందుకు ప్రణాళిక రూపొందించారనే అనుమానం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మున్సిపాలిటీకి రావాల్సిన బకాయిలను తక్షణమే వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ఎగ్జిబిషన్ బకాయిల వ్యవహారంలో ఎమ్మెల్యే ప్రమేయం లేదని నిరూపించుకోవాలంటే నిర్వాహకుల నుంచి పూర్తి సొమ్ము వసూలు చేయించాలని పాతకోట బంగారు మునిరెడ్డి సవాల్ విసిరారు.