BREAKING
బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా ఊటు నరేష్ జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధిగా కళ్ళెం సూర్య ప్రకాష్ చెత్త డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు .... ఎంసీ పల్లి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్. రత్నమ్మ చౌదరి నామినేషన్ దాఖలు.. దేవనకొండ మండలంలో 168 నామినేషన్లు పాలకుర్తిలో రైతు సదస్సు – వ్యవసాయ ప్రదర్శన పారిశుద్ధ్య కార్మికులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి

కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు

Select Suryaa Now
కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు

వెల్దుర్తి మేజర్ న్యూస్: పట్టణ సమీపంలోని రామళ్లకోట రోడ్డులో నక్కల తిప్ప వద్ద బైక్‌తో కారును ఢీకొన్న ఘటనలో యువకుడు గాయపడ్డాడు. కృష్ణగిరి ఏఎస్ఐ ఖాజాహుసేన్ కుమారుడు సర్ధార్ కర్నూలులో నివాసముంటూ, ప్రైవేట్ ఫర్టిలైజర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బోయనపల్లెకు బైక్‌పై వెళ్లి వెల్దుర్తి వైపు తిరిగి వస్తూ సంఘటనా స్థలంలో అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిచిన కారును ఢీకొన్నాడు. బైక్‌పై నుంచి కిందపడి గాయపడ్డాడు. అదే సమయంలో పక్కన డంపింగ్ యార్డులో చెత్తకు రేగిన నిప్పును ఆర్పేందుకు వచ్చిన డోన్ అగ్నిమాపక సిబ్బంది, మేజర్ పంచాయతీ కార్యదర్శి రెహమత్ బాషా, అటుగా ప్రయాణిస్తున్న సిద్దినగట్టు నాయకుడు వెంకటేశ్వర్లు, మరికొందరు యువకులు అపస్మారక స్థితికి చేరుకుంటున్న క్షతగాత్రుడిని తట్టి లేపుతూ సపర్యలు చేసి 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు కోలుకున్నట్లు సమాచారం.