BREAKING
బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా ఊటు నరేష్ జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధిగా కళ్ళెం సూర్య ప్రకాష్ చెత్త డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు .... ఎంసీ పల్లి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్. రత్నమ్మ చౌదరి నామినేషన్ దాఖలు.. దేవనకొండ మండలంలో 168 నామినేషన్లు పాలకుర్తిలో రైతు సదస్సు – వ్యవసాయ ప్రదర్శన పారిశుద్ధ్య కార్మికులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి

అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి

Select Suryaa Now
అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి

గుంటూరు :  అనారోగ్యంతో మృతి చెందిన లాలాపేట పోలీస్ స్టేషన్ హోంగార్డు పి. ప్రియాంక (స్టెల్లా)కు లాలాపేట పోలీసులు ఘనంగా నివాళులర్పించారు. ఆమె కుటుంబానికి అండగా నిలుస్తూ అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. లాలాపేట పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న పి. ప్రియాంక (స్టెల్లా) అనారోగ్య కారణాలతో మంగళవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న లాలాపేట పోలీస్ స్టేషన్ సీఐ ఏ.వి. శివప్రసాద్, ఎస్‌ఐలు షేక్ హషీం, వి. వెంకటరావుతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆమె పార్ధివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి, కుటుంబానికి తమ వంతు అండగా నిలిచారు. విధి నిర్వహణలో తమతో కలిసి పనిచేసిన సహచరురాలిని కోల్పోవడం పట్ల పోలీసు సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.

కే నాగరాజు గుంటూరు క్రైమ్