BREAKING
చెత్త డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు .... ఎంసీ పల్లి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్. రత్నమ్మ చౌదరి నామినేషన్ దాఖలు.. దేవనకొండ మండలంలో 168 నామినేషన్లు పాలకుర్తిలో రైతు సదస్సు – వ్యవసాయ ప్రదర్శన పారిశుద్ధ్య కార్మికులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి

కురవంక పంచాయతీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తాం : కూటమి సర్పంచ్ అభ్యర్థిని శ్రీవిద్యకు మద్ధతు ఇవ్వండి : కురవంక టిడిపి ఇన్చార్జ్ పసుపులేటి వినోద్ కుమార్ విజ్ఞప్తి

Select Suryaa Now
కురవంక పంచాయతీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తాం : కూటమి సర్పంచ్ అభ్యర్థిని శ్రీవిద్యకు మద్ధతు ఇవ్వండి : కురవంక టిడిపి ఇన్చార్జ్ పసుపులేటి వినోద్ కుమార్ విజ్ఞప్తి

మదనపల్లె రూరల్,మేజర్ న్యూస్ : కురవంక‌ పంచాయతీ అభివృద్ధికి కట్డుబడి ఉన్నామని కూటమి బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి శ్రీవిద్య భర్త,కురవంక టిడిపి ఇన్చార్జ్ పసుపులేటి వినోద్ కుమార్ స్పష్టం చేశారు.మంగళవారం కురవంకలోని తన నివాసంలో వార్డు మెంబర్ల అభ్యర్థులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా  వినోద్ కుమార్ మాట్లాడుతూ
కురవంక గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తన భార్య శ్రీవిద్యకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు,కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.2024లో తన తండ్రి మోహన్ బాబు మరణానంతరం ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ గ్రామ ప్రజలకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు.గత రెండేళ్ల కాలంలో ఎమ్మెల్యే సహకారంతో కురవంక గ్రామంలో సుమారు రూ.1.50 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని,గ్రామంలోని అన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించామని తెలిపారు.2013-2018 మధ్య కాలంలోనూ 12 గ్రామాల్లో తమ కుటుంబం చేసిన అభివృద్ధి పనులే తమను‌ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.గత ఐదేళ్లలో గ్రామానికి ఎలాంటి మేలుచేయని వారు నేడు ఓట్లు అడగడానికి రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.కురవంకకు చెందిన టిడిపి నేతలు బెల్లె రెడ్డి ప్రసాద్,బైగారి భారతి నాయుడుల సహకారంతో పంచాయతీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.పార్టీకి తాము అందించిన సేవలను గుర్తించి అధిష్టానం ఈ అవకాశం కల్పించిందన్నారు.తాము బరిలోకి దిగినప్పటి నుంచి కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని,ప్రజలు అటువంటి వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు.జవాబుదారీతనంతో పనిచేసే తమ కుటుంబానికి అండగా నిలిచి,రానున్న ఎన్నికల్లో శ్రీవిద్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన గ్రామస్థులను కోరారు.ఈ సమావేశంలో వార్డు మెంబర్ అభ్యర్థులు గంగాదేవి,రమణ,షెహనాజ్,మహాలక్ష్మీ,సమీనా,రాధ,సుమంత్,జనసేన నాయకులు పసుపులేటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి