BREAKING
చెత్త డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు .... ఎంసీ పల్లి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్. రత్నమ్మ చౌదరి నామినేషన్ దాఖలు.. దేవనకొండ మండలంలో 168 నామినేషన్లు పాలకుర్తిలో రైతు సదస్సు – వ్యవసాయ ప్రదర్శన పారిశుద్ధ్య కార్మికులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి

శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ

Select Suryaa Now
శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ
దుండిగల్ మేజర్ న్యూస్ శంభీపూర్‌లో ఈ నెల 19వ తేదీ గురువారం శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు శంభీపూర్‌లోని ఆయన నివాసంలో అరుణ్ గురుస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి భక్తుల ఆధ్యాత్మికత, భక్తిశ్రద్ధలకు అనుగుణంగా మహాపడి పూజను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వామి భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని శంభీపూర్ రాజు కోరారు. మల్లంపేట్ ఎగ్జిట్ 4ఏ సమీపంలోని శంభీపూర్ రాజు నివాసంలో ఈ మహాపడి పూజ నిర్వహించనున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.