BREAKING
ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ పేద విద్యార్థులకు సాయం అభినందనీయం అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి మీషో–యూట్యూబ్ భాగస్వామ్యం.. క్రియేటర్లకు ఆదాయ అవకాశాలు కురవంక పంచాయతీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తాం : కూటమి సర్పంచ్ అభ్యర్థిని శ్రీవిద్యకు మద్ధతు ఇవ్వండి : కురవంక టిడిపి ఇన్చార్జ్ పసుపులేటి వినోద్ కుమార్ విజ్ఞప్తి లక్షలాది మంది విద్యార్థులకు పిలుపు - 400లకు పైగా విద్యా సంస్థలకు ఆహ్వానం విద్యార్థులకు కంటి పరీక్షలు 19 మందికి అద్దాల కోసం సిఫార్సు వినుకొండలో సంచలనం.. వదిన ఆస్తినే కబ్జా చేసిన మరిది కుటుంబం సేవతో అన్నదానం తృప్తితో జీవనం. పర్చూరు నియోజకవర్గంలో ఆరు మండలాల ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక మున్సిపాలిటీకి రావాల్సిన ఎగ్జిబిషన్ బకాయి వసూలు చేయాలి కార్మిక సంక్షేమ బోర్డు నిధుల మళ్లింపును సహించం.. ఇంజనీరింగ్‌ను కాదని వ్యవసాయ బాట.. గోవా బీడు భూమిని సేంద్రియ క్షేత్రంగా మార్చిన యువకుడు! ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన శాంతిభద్రతల చర్యలు : ఐజీ బి. రాజకుమారి

కార్మిక సంక్షేమ బోర్డు నిధుల మళ్లింపును సహించం..

Select Suryaa Now
కార్మిక సంక్షేమ బోర్డు నిధుల మళ్లింపును సహించం..
ముషీరాబాద్ మేజర్ న్యూస్ :కార్మిక సంక్షేమ బోర్డు నిధుల మళ్లింపును వెంటనే నిలిపివేయాలని, లేనిపక్షంలో ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. కార్మికుల హక్కులు, సంక్షేమ నిధుల పరిరక్షణకు సంఘాలన్నీ ఐక్యంగా పోరాడాలని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్  బాగ్‌లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీఆర్‌టీయూ అనుబంధ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు నారాయణ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ బీమా కార్యకలాపాలను ట్రయల్ బ్లేజర్ సంస్థకు అప్పగించి రూ.150 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, కార్మికులకు సంబంధం లేని ఆధునిక శిక్షణ కేంద్రాల కోసం రూ.600 కోట్లు కేటాయించారని ఆరోపించారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలో బోర్డు బీమా కార్యకలాపాలను విలీనం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నారాయణ మాట్లాడుతూ కార్మిక సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయకుండా బలోపేతం చేయాలని, హెల్త్ స్క్రీనింగ్ పరీక్షల పేరుతో నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని, పెండింగ్ క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించాలని కోరారు. బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ 1996లో కార్మికుల సంక్షేమం కోసం మహోన్నత లక్ష్యాలతో ఏర్పాటైన బోర్డు నిధులపై రాజకీయ నాయకులు కన్నేయడం దురదృష్ట కరమన్నారు. కార్మికుల సొమ్మును కాపాడుకునేందుకు సంఘాలన్నీ ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య మాట్లాడుతూ కార్మిక సంక్షేమ బోర్డు నిధులు కార్మికుల ప్రయోజనాలకే వినియోగించాలని, వాటిని ఇతర పథకాలకు మళ్లించే చర్యలను అడ్డుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో ప్రభాకర్, పాలదుగుల రమేష్, టీయూసీఐ అధ్యక్షుడు సూర్యం, ఐఎఫ్‌టీయూ అధ్యక్షురాలు అనురాధ, ఏఐటీయూసీ నాయకుడు యాదగిరి, కమర్ల ఐలయ్య, కుమార్, రాజు, కొండల రెడ్డి, పల్లపు సత్యనారాయణ, గంధం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.