BREAKING
చెత్త డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు .... ఎంసీ పల్లి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్. రత్నమ్మ చౌదరి నామినేషన్ దాఖలు.. దేవనకొండ మండలంలో 168 నామినేషన్లు పాలకుర్తిలో రైతు సదస్సు – వ్యవసాయ ప్రదర్శన పారిశుద్ధ్య కార్మికులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి

విద్యార్థులకు కంటి పరీక్షలు 19 మందికి అద్దాల కోసం సిఫార్సు

Select Suryaa Now
విద్యార్థులకు కంటి పరీక్షలు 19 మందికి అద్దాల కోసం సిఫార్సు

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్: జిల్లా అంధత్వ నివారణ సంఘం ఆధ్వర్యంలో పాఠశాల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు పట్టణంలోని 2వ వార్డు మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు తేజా పాల్గొని మొత్తం 296 మంది విద్యార్థినీ, విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 19 మందికి కంటి చూపు సమస్యలు ఉన్నట్లు గుర్తించి, కంటి అద్దాల కోసం సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా కంటి వైద్య నిపుణులు తేజా మాట్లాడుతూ.. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నట్లుగా మనిషి జీవితంలో కంటి చూపు ఎంతో విలువైనదని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎక్కువసేపు సెల్‌ఫోన్లు, టీవీలు చూడకుండా ఉండాలని, చదివేటప్పుడు సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలని, కళ్లకు ఇబ్బంది కలిగినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని వివరించారు. కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా భవిష్యత్తులో చూపు సంబంధిత ఇబ్బందులను నివారించవచ్చన్నారు. పాఠశాల స్థాయిలో ఇలాంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఉన్న ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన వైద్యసేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత, సీఓ ఎంవీ సుబ్బారెడ్డి, హెల్త్ సెక్రటరీ రెబక, హెల్త్ అసిస్టెంట్ రామకృష్ణ, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.