BREAKING
చెత్త డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు .... ఎంసీ పల్లి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్. రత్నమ్మ చౌదరి నామినేషన్ దాఖలు.. దేవనకొండ మండలంలో 168 నామినేషన్లు పాలకుర్తిలో రైతు సదస్సు – వ్యవసాయ ప్రదర్శన పారిశుద్ధ్య కార్మికులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి

వినుకొండలో సంచలనం.. వదిన ఆస్తినే కబ్జా చేసిన మరిది కుటుంబం

Select Suryaa Now
వినుకొండలో సంచలనం.. వదిన ఆస్తినే కబ్జా చేసిన మరిది కుటుంబం

వినుకొండలో సంచలనం.. వదిన ఆస్తినే కబ్జా చేసిన మరిది కుటుంబంగతంలో అదే డోర్ నెంబర్  నెంబర్నెం. 392 పై డబుల్ రిజిస్ట్రేషన్.. రిజిస్ట్రార్ పాత్రపై అనుమానాలవినుకొండ పట్టణంలో అక్రమ భూ కబ్జా వ్యవహారం సంచలనం రేపుతోంది. సొంత కుటుంబ సభ్యుల ఆస్తినే కబ్జా చేసిన ఘటనపై బాధితులు న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
బాధితులు జోరిగే ఏడుకొండలు - జోరిగే రమాదేవి దంపతుల కథనం ప్రకారం... వారికి చెందిన 1/25 సెంట్ల భూమిని వారి మరిది జోరిగే శ్రీనివాసరావు మరియు అతని భార్య జోరిగే సుభాషిని అక్రమంగా కబ్జా చేశారు.
అధికారులను మేనేజ్ చేసి, ఒకే డోర్ నెంబర్ 392 మీద రెండు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపణ. ఒక ఆస్తికి రెండుసార్లు రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందనే దానిపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పాత్రపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మా సొంత ఆస్తిని, మా మరిదే కబ్జా చేశాడు. రెవెన్యూ రికార్డుల్లో మా పేరు ఉన్నా, అక్రమ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రార్ గారిపై కూడా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులు పూర్తి వివరాలు విచారించి మాకు న్యాయం చేయాలి" అని ఏడుకొండలు, రమాదేవి దంపతులు వాపోతున్నారు.
392 సర్వేనెంబర్ డాక్యుమెంట్ కు సంబంధించిన అసలు రికార్డులను బయటకు తీయాలి
డబుల్ రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందో విచారించాలి
రిజిస్ట్రార్ పాత్రపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలిబాధితుల ఆస్తిని తిరిగి వారికి అప్పగించాలి
ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఆర్డీవో, వినుకొండ సబ్ రిజిస్ట్రార్ స్పందించి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల