BREAKING
ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ పేద విద్యార్థులకు సాయం అభినందనీయం అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి మీషో–యూట్యూబ్ భాగస్వామ్యం.. క్రియేటర్లకు ఆదాయ అవకాశాలు కురవంక పంచాయతీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తాం : కూటమి సర్పంచ్ అభ్యర్థిని శ్రీవిద్యకు మద్ధతు ఇవ్వండి : కురవంక టిడిపి ఇన్చార్జ్ పసుపులేటి వినోద్ కుమార్ విజ్ఞప్తి లక్షలాది మంది విద్యార్థులకు పిలుపు - 400లకు పైగా విద్యా సంస్థలకు ఆహ్వానం విద్యార్థులకు కంటి పరీక్షలు 19 మందికి అద్దాల కోసం సిఫార్సు వినుకొండలో సంచలనం.. వదిన ఆస్తినే కబ్జా చేసిన మరిది కుటుంబం సేవతో అన్నదానం తృప్తితో జీవనం. పర్చూరు నియోజకవర్గంలో ఆరు మండలాల ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక మున్సిపాలిటీకి రావాల్సిన ఎగ్జిబిషన్ బకాయి వసూలు చేయాలి కార్మిక సంక్షేమ బోర్డు నిధుల మళ్లింపును సహించం.. ఇంజనీరింగ్‌ను కాదని వ్యవసాయ బాట.. గోవా బీడు భూమిని సేంద్రియ క్షేత్రంగా మార్చిన యువకుడు! ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన శాంతిభద్రతల చర్యలు : ఐజీ బి. రాజకుమారి

ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన శాంతిభద్రతల చర్యలు : ఐజీ బి. రాజకుమారి

Select Suryaa Now
ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన శాంతిభద్రతల చర్యలు :  ఐజీ బి. రాజకుమారి

అమరావతి, మేజర్‌న్యూస్‌ :

రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు విస్తృతమైన భద్రతా చర్యలు చేపట్టిందని మంగళవారం ఒక ప్రకటనలో  ఐజీ రాజకుమారి తెలిపారు.

2026 నవంబర్ 14 వ తేదీ నుంచి నవంబర్ 16 వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన శాంతిభద్రతల పరిరక్షణ చర్యలు, నమోదు చేసిన కేసులు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

శాంతిభద్రతల పరిరక్షణ – ముఖ్య గణాంకాలు

నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు 24

ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) ఉల్లంఘన కేసులు 444

స్వాధీనం చేసుకున్న మద్యం 200.55 లీటర్లు

బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్లు 126/129 కింద బైండ్ ఓవర్ చేసిన కేసులు 722

బైండ్ ఓవర్ చేసిన వ్యక్తులు 5,327

ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టిందని ఐజీ బి. రాజకుమారి  ఆ ప్రకటనలో తెలియజేశారు.