BREAKING
చెత్త డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు .... ఎంసీ పల్లి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్. రత్నమ్మ చౌదరి నామినేషన్ దాఖలు.. దేవనకొండ మండలంలో 168 నామినేషన్లు పాలకుర్తిలో రైతు సదస్సు – వ్యవసాయ ప్రదర్శన పారిశుద్ధ్య కార్మికులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి

పేద విద్యార్థులకు సాయం అభినందనీయం

Select Suryaa Now
పేద విద్యార్థులకు సాయం అభినందనీయం

గుంటూరు రూరల్, మేజర్ న్యూస్:

గుంటూరు స్తంభాలగరువు లోని అనవేమా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఉడుముల కోటిరత్నం సాంబిరెడ్డి వసతి గృహం అభివృద్ధి నిమిత్తం  అమెరికా వాసి మెట్టు జయ మనోహర్ రెడ్డి, శ్రీలక్ష్మి దంపతులు,  ఈమని వెంకట రెడ్డి, జయలక్ష్మి దంపతులు ఈరోజు ట్రస్ట్ కార్యాలయం లో జరిగిన కార్యక్రమంలో చెరో అయిదు లక్షలు రూపాయలు అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ ఉడుముల శ్రీనివాస రెడ్డి, సెక్రటరీ మున్నంగి సంజీవరెడ్డికి చెక్కు అందించారు. దాత మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నతనం లో చదువుకోవటానికి అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్క్కొన్నానని, అయినా చదువుపట్ల ఆసక్తి తో కష్టపడి చదివి ఈరోజు అమెరికా లో ఉన్నత స్థాయి కి చేరానని.. చదువు విలువ తెలిసిన వ్యక్తిగా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే సంకల్పం తో ఉన్నానని తెలిపారు. ట్రస్ట్ చైర్మన్ ఉడుముల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. మా ట్రస్ట్ లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో నిర్వహిస్తున్న  కార్యక్రమాలకు దాతలు సహకారం అందించటం వలన ఎంతో మంది విద్యార్థులకు ఆర్ధిక సాయంతో పాటు మంచి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సెక్రటరీ సంజీవ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల సంక్షేమం కోసం దాతలు ముందుకు వచ్చి అందిస్తున్న దాతృత్వం ఎంతో గొప్పదని, విదేశాలలో స్థిరపడి మాతృదేశానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న దానశీలురు ఈ మామా అల్లుళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఉడుముల శివా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఆళ్ల వీరభద్రరావు, సీనియర్ రిపోర్టర్