BREAKING
చెత్త డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు .... ఎంసీ పల్లి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్. రత్నమ్మ చౌదరి నామినేషన్ దాఖలు.. దేవనకొండ మండలంలో 168 నామినేషన్లు పాలకుర్తిలో రైతు సదస్సు – వ్యవసాయ ప్రదర్శన పారిశుద్ధ్య కార్మికులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి

అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

Select Suryaa Now
 అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి :  జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

 అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఆదేశించారు. తుపాను, స్థానిక ఎన్నికలు, ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా ఏర్పాటుపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో మంగళవారం ఆయన స్థానిక కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు.
      
       అక్వాన్ తుపానుతో బాపట్ల జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన తరుణంలో నల్లమడ కాల్వ గండ్లు యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలని కలెక్టర్ చెప్పారు. అత్యధిక వర్షపాతం నమోదు కానుందని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. ఈ నేపథ్యంలో జలవనరులు, పంట కాల్వల ఇంజినీరింగ్ అధికారులు మరమ్మతు పనులను ముమ్మరంగా చేపట్టాలన్నారు. అన్ని శాఖల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రధానంగా విద్యుత్ శాఖ అధికారులు చురుగ్గా పనిచేయాల్సి ఉందన్నారు. విపత్తు సమయములో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ఫోన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి ఫోన్ కాల్ కు, వాట్సాప్ మెసేజ్ కి సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఏం పనులు చేస్తున్నారో ఎప్పటికప్పుడు ఫోటోలు పంపాలని ఆదేశించారు. తుపాను నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఆయన మార్గ నిర్దేశం చేశారు. 
     
     ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితా రూపొందించడంలో రెవెన్యూ అధికారులు, బి ఎల్ ఓ లు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. ఫాం-6 కింద మార్టూరులో 160, పర్చూరులో 60 బాపట్లలో 15 దరఖాస్తులు పెండింగ్ లో ఉండడంపై ఆయన అరా తీశారు. ఫాం-8 లో బాపట్ల మండలంలో 221 దరఖాస్తులు పెండింగ్లో ఉండడం ఏమిటని నిలదీశారు. ఇంటింటా సర్వే పూర్తి చేసినప్పటికీ అదనంగా దరఖాస్తుల రావడం ఏమిటని ప్రశ్నించారు. నిబంధనలు అనుసరించి అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని, అదే ప్రకారం పని చేయాలని ఆయన సూచించారు. చీరాల మండలంలో మొత్తం 163 దరఖాస్తులు, రేపల్లెలో 62 దరఖాస్తులు పెండింగ్లో ఉండడంపై ప్రశ్నించారు. బాపట్ల మున్సిపాలిటీలో బి ఎల్ వోలు నిర్లిప్తంగా పనిచేయడం ఏమిటని నిలదీశారు. అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు.
     
      స్థానిక సంస్థల ఎన్నికలకు మానవ వనరులను ప్రణాళిక బద్ధంగా సమకూర్చుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విధులకు గైర్హాజరైతే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. ఆరోగ్యం బాగోలేదని విధులకు గైర్హాజరైతే అలాంటి వారిని నిశితంగా పరిశీలించిన తదుపరి మాత్రమే మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. ఆయా గ్రామ పంచాయతీలకు నియమించే ఎన్నికల అధికారులు ఆ పంచాయతీలలో గడిచిన ఐదేళ్లు పనిచేసి ఉండరాదని, స్థానికులై ఉండరాదని స్పష్టం చేశారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులందరికీ కచ్చితంగా ఐ డి కార్డులు ఇవ్వాలన్నారు. అలాగే డిజిటల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులను డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు నియమించరాదన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు దివ్యాంగులు, క్యాన్సర్ పేషెంట్లు, గర్భిణీలు, ఏడాది పిల్లలు ఉన్న బాలింతలు, నిబంధనలో ఉన్న వారిని ఎన్నికల విధులకు మినహాయించాలన్నారు. శాసన మండలి ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
          
         ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, డీపీఓ నగేష్ కుమారి, బాపట్ల ఆర్డిఓ హరికుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసిల్దార్లు, విఆర్వోలు, బిఎల్ఓ లు, తదితరులు పాల్గొన్నారు.