బిజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా గూడెం రమేష్
షాబాద్ : షాబాద్ మండలం అప్పారెడ్డిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన గూడెం రమేష్ భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. గతంలో ఐదేళ్లపాటు ఏబీవీపీలో పనిచేసిన ఆయన విద్యార్థుల సమస్యలు, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అనంతరం బజరంగ్ దళ్‌లో మండల స్థాయి నుంచి విభాగ్ సంయోజక్‌గా ఆరు జిల్లాల బాధ్యతలు నిర్వహించారు. దేవాలయాల పరిరక్షణ, హిందూ సంస్కృతి సంప్రదాయాల కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. అయోధ్య రామమందిర నిధి సేకరణ, అక్షింతల పంపిణీలో షాబాద్ మండలంలోని ప్రతి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. తన సేవలను గుర్తించి జిల్లా స్థాయి బాధ్యత అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన రమేష్.. గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు, యువమోర్చా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
శివరాజ్ : షాబాద్ - మేజర్ న్యూస్