telangana
పాఠశాల అభివృద్ధికి సహకరిస్తా... విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ జన్మదిన వేడుకలు
వెంగళరావునగర్, మేజర్ న్యూస్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ జన్మదిన వేడుకలను వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని వెంగళరావునగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేవిరెడ్డి నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తానన్నారు. విద్యార్థులతో ఆనందాన్ని పంచుకుంటూ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సి. హనుమంతరావు, సురేఖ, శ్రీనివాస్, సోమా, రామచందర్, శౌరిరాజు, వినయ్‌కుమార్ గౌడ్, సురేందర్, రవికుమార్, రాఘవేందర్, శంకర్, గౌస్, శరత్, నటరాజ్, జమీలా, ఊర్మిళరెడ్డి తదితరులు పాల్గొన్నారు