BREAKING
సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ పేద విద్యార్థులకు సాయం అభినందనీయం అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి మీషో–యూట్యూబ్ భాగస్వామ్యం.. క్రియేటర్లకు ఆదాయ అవకాశాలు కురవంక పంచాయతీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తాం : కూటమి సర్పంచ్ అభ్యర్థిని శ్రీవిద్యకు మద్ధతు ఇవ్వండి : కురవంక టిడిపి ఇన్చార్జ్ పసుపులేటి వినోద్ కుమార్ విజ్ఞప్తి లక్షలాది మంది విద్యార్థులకు పిలుపు - 400లకు పైగా విద్యా సంస్థలకు ఆహ్వానం విద్యార్థులకు కంటి పరీక్షలు 19 మందికి అద్దాల కోసం సిఫార్సు వినుకొండలో సంచలనం.. వదిన ఆస్తినే కబ్జా చేసిన మరిది కుటుంబం సేవతో అన్నదానం తృప్తితో జీవనం. పర్చూరు నియోజకవర్గంలో ఆరు మండలాల ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక మున్సిపాలిటీకి రావాల్సిన ఎగ్జిబిషన్ బకాయి వసూలు చేయాలి కార్మిక సంక్షేమ బోర్డు నిధుల మళ్లింపును సహించం.. ఇంజనీరింగ్‌ను కాదని వ్యవసాయ బాట.. గోవా బీడు భూమిని సేంద్రియ క్షేత్రంగా మార్చిన యువకుడు!

మిట్స్‌లో ఏజెంటిక్ ఏఐ ఆచరణాత్మక వినియోగంపై అవగాహన సదస్సు : హాజరైన బ్లూ యాండర్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ కేదారిశెట్టి

Select Suryaa Now
మిట్స్‌లో ఏజెంటిక్ ఏఐ ఆచరణాత్మక వినియోగంపై అవగాహన సదస్సు : హాజరైన బ్లూ యాండర్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ కేదారిశెట్టి

కురబలకోట,మేజర్ న్యూస్ : మదనపల్లి సమీపంలో గల (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏజెంటిక్ ఏఐ - ఆచరణాత్మక వినియోగాలు అనువర్తనాలు అనే అంశంపై మంగళవారం ఒకరోజు సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరులోని బ్లూ యాండర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ కేదారిశెట్టి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందుతోందని,ముఖ్యంగా ఏజెంటిక్ ఏఐ భవిష్యత్తులో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందన్నారు.సాధారణ చాట్‌బాట్‌లకు,ఏజెంటిక్ ఏఐకి మధ్య ఉన్న వ్యత్యాసాలను వివరిస్తూ,ఏఐ ఏజెంట్లు స్వయంగా పరిస్థితులను విశ్లేషించడం,లక్ష్యాలను అర్థం చేసుకోవడం,ప్రణాళికలు రూపొందించడం,వివిధ సాంకేతిక సాధనాలు మరియు ఏపీఐల సహాయంతో పనులను పూర్తి చేయడం వంటి సామర్థ్యాలను కలిగి ఉంటాయని తెలిపారు.ఏజెంటిక్ ఏఐ లోని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్,మెమరీ,కాంటెక్స్ట్,ప్లానింగ్,భద్రతా నియంత్రణలు,మానవ పర్యవేక్షణ వంటి అంశాల ప్రాధాన్యతను తెలియజేశారు.ముఖ్యంగా సరఫరా గొలుసు నిర్వహణ,వ్యాపార కార్యకలాపాలు,పరిశ్రమల ఆటోమేషన్,తక్షణ వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో ఏజెంటిక్ ఏఐ వినియోగాన్ని వాస్తవ ఉదాహరణలతో వివరించారు.విద్యార్థులు ప్రోగ్రామింగ్,సమస్య పరిష్కార నైపుణ్యాలు,ఏఐ టూల్స్ వినియోగం,ప్రాజెక్టులపై పట్టు సాధించడం ద్వారా భవిష్యత్తులో ఉన్నతస్థాయి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు.ఏఐ ఆధారిత వ్యవస్థల అభివృద్ధిలో డేటా నాణ్యత,విశ్వసనీయత,వ్యయ నియంత్రణ,సైబర్ భద్రత,జవాబుదారీతనం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ఏఐ,మెషిన్ లెర్నింగ్,డేటా సైన్స్,ఏఐ ఏజెంట్ డెవలప్‌మెంట్,సాఫ్ట్‌వేర్ ఆటోమేషన్,క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో  విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతిక యుగంలో మారుతున్న సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ,ఆచరణాత్మక నైపుణ్యాలు,పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు.ఆధునిక సాంకేతికతపై అవగాహన,సృజనాత్మక ఆలోచన,సమస్య పరిష్కార నైపుణ్యాలు కలిగిన విద్యార్థులకు ప్రముఖ ఐటీ సంస్థలు,సాఫ్ట్‌వేర్ కంపెనీలు,స్టార్టప్‌లు,పరిశోధనా సంస్థల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్,విభాగాధిపతి డాక్టర్ ఎం.శ్రీదేవి,కో-ఆర్డినేటర్స్ డాక్టర్ కే.కృష్ణయ్య,డాక్టర్ ఆస్పిన్ పబి,అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి