BREAKING
సేవతో అన్నదానం తృప్తితో జీవనం. పర్చూరు నియోజకవర్గంలో ఆరు మండలాల ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక మున్సిపాలిటీకి రావాల్సిన ఎగ్జిబిషన్ బకాయి వసూలు చేయాలి కార్మిక సంక్షేమ బోర్డు నిధుల మళ్లింపును సహించం.. ఇంజనీరింగ్‌ను కాదని వ్యవసాయ బాట.. గోవా బీడు భూమిని సేంద్రియ క్షేత్రంగా మార్చిన యువకుడు! ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన శాంతిభద్రతల చర్యలు : ఐజీ బి. రాజకుమారి పాఠశాల అభివృద్ధికి సహకరిస్తా... విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ జన్మదిన వేడుకలు మిట్స్‌లో ఏజెంటిక్ ఏఐ ఆచరణాత్మక వినియోగంపై అవగాహన సదస్సు : హాజరైన బ్లూ యాండర్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ కేదారిశెట్టి ఎన్నికల విధులపై సిబ్బందికి దిశానిర్దేశం బిజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా గూడెం రమేష్ కుత్బుల్లాపూర్ ని. వ. పరిధిలోని గాజులరామారం డివిజన్ లో గిరివర్ధనరెడ్డి పర్యటన రాష్ట్రస్థాయి జూడో పోటీలకు అంకంపల్లి విద్యార్థి ఎంపిక రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా టిడిపి మద్దతుదారుడు బిల్లే నాగరాజు యాదవ్ నామినేషన్ హెబ్బటంలో వైస్సార్సీపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు మెగాస్పీడ్ సంస్థపై 2024 నుంచే దర్యాప్తు.. ఎన్విడియా ఫలితాలకు ముందు అమెరికా కీలక ప్రకటన!

రాష్ట్రస్థాయి జూడో పోటీలకు అంకంపల్లి విద్యార్థి ఎంపిక

Select Suryaa Now
రాష్ట్రస్థాయి జూడో పోటీలకు అంకంపల్లి విద్యార్థి ఎంపిక

.బెలుగుప్ప: మండల పరిధిలోని అంకంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని వై. నందిని రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపికై పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. అనంతపురంలోని న్యూటన్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి జూడో ఎంపిక పోటీలు (అండర్‌-17)లో నందిని అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించింది. ఈ విజయంతో కాకినాడలో త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఇదే పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని జి. గౌతమి, తొమ్మిదో తరగతి విద్యార్థి డి. యోగేంద్ర కూడా పోటీల్లో ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాలు సాధించారు. ఈ విషయాన్ని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు యు. కోటప్ప (ఎస్‌ఏపీఈ) వెల్లడించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన నందినితోపాటు ద్వితీయ స్థానాలు సాధించిన గౌతమి, యోగేంద్రలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి. రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం క్రీడల్లో తమ ప్రతిభను చాటుతూ రాష్ట్రస్థాయికి ఎదగడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంపొందించుకోవాలని, క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే ఉన్నత విజయాలు సాధించవచ్చని తెలిపారు. నందిని కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించి పాఠశాలకు, మండలానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయంతో పాఠశాలలో ఆనందం నెలకొంది. పలువురు గ్రామస్తులు, విద్యార్థులు విజేతలకు అభినందనలు తెలిపారు.
బెళుగుప్ప రిపోర్టర్ జయశంకర్.