BREAKING
ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ పేద విద్యార్థులకు సాయం అభినందనీయం అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి మీషో–యూట్యూబ్ భాగస్వామ్యం.. క్రియేటర్లకు ఆదాయ అవకాశాలు కురవంక పంచాయతీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తాం : కూటమి సర్పంచ్ అభ్యర్థిని శ్రీవిద్యకు మద్ధతు ఇవ్వండి : కురవంక టిడిపి ఇన్చార్జ్ పసుపులేటి వినోద్ కుమార్ విజ్ఞప్తి లక్షలాది మంది విద్యార్థులకు పిలుపు - 400లకు పైగా విద్యా సంస్థలకు ఆహ్వానం విద్యార్థులకు కంటి పరీక్షలు 19 మందికి అద్దాల కోసం సిఫార్సు వినుకొండలో సంచలనం.. వదిన ఆస్తినే కబ్జా చేసిన మరిది కుటుంబం సేవతో అన్నదానం తృప్తితో జీవనం. పర్చూరు నియోజకవర్గంలో ఆరు మండలాల ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక మున్సిపాలిటీకి రావాల్సిన ఎగ్జిబిషన్ బకాయి వసూలు చేయాలి కార్మిక సంక్షేమ బోర్డు నిధుల మళ్లింపును సహించం.. ఇంజనీరింగ్‌ను కాదని వ్యవసాయ బాట.. గోవా బీడు భూమిని సేంద్రియ క్షేత్రంగా మార్చిన యువకుడు! ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన శాంతిభద్రతల చర్యలు : ఐజీ బి. రాజకుమారి

ఎన్నికల విధులపై సిబ్బందికి దిశానిర్దేశం

Select Suryaa Now
ఎన్నికల విధులపై సిబ్బందికి దిశానిర్దేశం

* నామినేషన్ల పరిశీలన, ఆన్‌లైన్ అప్‌లోడ్‌లో అప్రమత్తంగా ఉండాలి

* ఎన్నికల సమావేశంలో మాట్లాడిన ఎంపీడీవో స్వరూపా రాణి

భోగాపురం, (మేజర్ న్యూస్): రానున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఆన్‌లైన్‌లో వివరాల అప్‌లోడ్ ప్రక్రియను పూర్తి అప్రమత్తతతో చేపట్టాలని ఎంపీడీవో డి.డి. స్వరూపారాణి సూచించారు. ఎన్నికల విధుల్లో భాగంగా పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లకు నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నామినేషన్లకు సంబంధించి అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం అవసరమైన వివరాలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఎన్నికలకు అవసరమైన మెటీరియల్ అంతా సిద్ధంగా ఉందని, విధుల నిర్వహణలో సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీవో గాయత్రి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు విధివిధానాలు, సిబ్బంది అనుసరించాల్సిన జాగ్రత్తలను వివరించారు. సమావేశంలో ఏవో కామేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

 రిపోర్టర్: వై.శ్రీనివాస్, భోగాపురం.