రెవెన్యూ వసూళ్లపై సమీక్ష.. రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం.. వంద శాతం పన్నుల వసూలుకు మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్ రావు ఆదేశాలు..
(అనంతపురం కార్పొరేషన్ మేజర్ న్యూస్..)
అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లో మంగళవారం మధ్యాహ్నం రెవెన్యూ వసూళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జస్వంత్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నగరంలో ఇంటి పన్ను, కుళాయి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, వాటర్ చార్జీల బకాయిల వసూళ్లపై సమీక్షించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డుల వారీగా పన్నుల డిమాండ్, బకాయిల వివరాలను పరిశీలించి, అధిక మొత్తంలో బకాయిలు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, అమీనిటీస్ సెక్రటరీలు సమన్వయంతో ఇంటింటికీ వెళ్లి పన్నుల వసూళ్లు చేపట్టాలని సూచించారు. ఇంటి పన్నులతో పాటు వాటర్ చార్జీల బకాయిలను కూడా వసూలు చేసి వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని స్పష్టం చేశారు.నగర ప్రజలు తమ పన్నుల బకాయిలను సకాలంలో చెల్లించి, నగరపాలక సంస్థకు సహకరించాలని, పన్నుల రూపంలో సమకూరే ఆదాయం నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతగానో ఉపయోగపడుతుందని కమిషనర్ తెలిపారు.ఈ సమావేశంలో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, అమీనిటీస్ సెక్రటరీలు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, రెవెన్యూ విభాగం క్లర్కులు పాల్గొన్నారు.