BREAKING
కుత్బుల్లాపూర్ ని. వ. పరిధిలోని గాజులరామారం డివిజన్ లో గిరివర్ధనరెడ్డి పర్యటన రాష్ట్రస్థాయి జూడో పోటీలకు అంకంపల్లి విద్యార్థి ఎంపిక రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా టిడిపి మద్దతుదారుడు బిల్లే నాగరాజు యాదవ్ నామినేషన్ హెబ్బటంలో వైస్సార్సీపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు మెగాస్పీడ్ సంస్థపై 2024 నుంచే దర్యాప్తు.. ఎన్విడియా ఫలితాలకు ముందు అమెరికా కీలక ప్రకటన! కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే జిఎంఆర్.. వలస గ్రామపంచాయతీ సర్పంచ్ రేసులో బిఎస్ నాగరాజు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా కందడి శ్రీరాములు నియామకం యూరప్ ట్రిప్‌లో తిన్న ఒక్క కుకీతో వైరల్ బిజినెస్ సృష్టించిన భార్యాభర్తలు! రెండో విడత గ్రామ సర్పంచ్ నామినేషన్లకు పటిష్ట భద్రతా ఏర్పాటు ‘బై’ రేటింగ్ కొనసాగిస్తూ రూ. 3,820 టార్గెట్ ప్రైస్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్! కేన్స్ టెక్నాలజీ షేర్లపై బ్రోకరేజ్ విశ్లేషణ దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్ విడుదల, వ్యోమగామి కావాలనుకునే అమ్మాయికి అండగా హీరో విద్యార్థులకు ప్రాథమిక హక్కులపై అవగాహన కార్యక్రమం.. ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ విస్తృత దాడులు.. కర్ణాటక మద్యం స్వాధీనం. బ్రాకరేజ్ రిపోర్ట్: ఏబీబీ ఇండియా, రిలాక్సో ఫుట్‌వేర్ త్రైమాసిక ఫలితాల విశ్లేషణ & హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కొత్త టార్గెట్ ప్రైస్‌లు!

రెండో విడత గ్రామ సర్పంచ్ నామినేషన్లకు పటిష్ట భద్రతా ఏర్పాటు

Select Suryaa Now
రెండో విడత గ్రామ సర్పంచ్ నామినేషన్లకు పటిష్ట భద్రతా ఏర్పాటు

 

 డీఎస్పీ వెంకటనారాయణ 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్.చిత్తూరు సబ్-డివిజన్ పరిధి లోని యాదమరి, తవణంపల్లి, పూతలపట్టు, రొంపిచెర్ల, పులిచెర్ల, ఐరాల మండలాల్లో నిర్వహించనున్న రెండో విడత గ్రామ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.నామినేషన్ కేంద్రాల వద్ద తగినంత పోలీస్ సిబ్బందిని నియమించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరణ ద్వారా పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, డ్రోన్ కెమెరాల సహాయంతో నామినేషన్ కేంద్రాలు, వాటి పరిసర ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచి, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు.నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు, వారి మద్దతుదారులు నామినేషన్ కేంద్రాల వద్ద గుంపులుగా గుమిగూడడం, ర్యాలీలుగా రావడం, అనవసరంగా హడావుడి సృష్టించడం వంటి చర్యలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అమలులో ఉన్న బి ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ 163 నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి స్వేచ్ఛగా, ఎలాంటి భయం, ఒత్తిడి, బెదిరింపులు లేకుండా నామినేషన్ దాఖలు చేసుకునే హక్కు ఉందని, ఆ హక్కుకు ఎవరైనా భంగం కలిగించే ప్రయత్నం చేస్తే ఉపేక్షించబోమని డీఎస్పీ స్పష్టం చేశారు. అభ్యర్థులు లేదా వారి మద్దతుదారులను బెదిరించడం, అడ్డుకోవడం, ఘర్షణలకు పాల్పడడం, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే, ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా వేదికలపై రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు లేదా శాంతిభద్రతలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అభ్యర్థితో సమానంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.గ్రామ సర్పంచ్ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తయ్యేలా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని తెలిపారు.

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.